By: Arun Kumar Veera | Updated at : 27 May 2024 12:52 PM (IST)
సెక్షన్ 44AA, 44AB, 44AD ఎవరి కోసం?
Income Tax Return Filing 2024: పన్ను చెల్లించగల ఆదాయం సంపాదిస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతి ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయాలి & పన్ను చెల్లించాలి. దీనికంటే ముందు, పన్ను విధించదగిన ఆదాయాన్ని లెక్కించాలి. జీతం తీసుకునే టాక్స్ పేయర్ల (salaried taxpayers) విషయంలో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ చాలా సులభంగా ఉంటుంది. ఫ్రీలాన్సర్ లేదా కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్న వ్యక్తుల విషయంలో ITR దాఖలు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఈ కేటగిరీ వ్యక్తులకు చెందిన ఖాతాలను తప్పనిసరిగా ఆడిట్ చేయించాలి.
వ్యాపారం లేదా వృత్తిపరమైన సేవలు అందించే వ్యక్తుల (కన్సల్టెంట్లు) ఖాతాల పుస్తకాల నిర్వహణను ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 44AA చూసుకుంటుంది. ఇదే కేటగిరీలోని వ్యక్తులకు చెందిన ఖాతాల ఆడిట్ సెక్షన్ 44AB కిందకు వస్తుంది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44AB ప్రకారం, ఈ సందర్భాల్లో ఖాతాల ఆడిట్ తప్పనిసరి:
- గత ఆర్థిక సంవత్సరంలో మీ వ్యాపారం గ్రాస్ టర్నోవర్ రూ.1 కోటికి మించి ఉంటే, లేదా, మీ వృత్తి నుంచి గ్రాస్ రిసిప్ట్స్ రూ.50 లక్షలు దాటితే
- వ్యాపారం లేదా వృత్తి 44ADA లేదా 44AE లేదా 44BB లేదా 44BBB సెక్షన్‌ల కింద కవర్ అయి, పైన చెప్పిన పరిమితి కంటే తక్కువ లాభాలు ఉంటే
- ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు లేదా వృత్తులు చేస్తుంటే.. ఆడిట్ చేయించాలా, వద్దా అన్నది తేల్చడానికి అన్ని వ్యాపారాలు లేదా వృత్తుల టర్నోవర్‌ను కలపాలి
సెక్షన్ 44AA పరిధిలోకి వచ్చే నిపుణులు
- మెడిసిన్, లా, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, అకౌంటెన్సీ, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డెకరేషన్, సినీ పరిశ్రమ, అడ్వర్‌టైజ్‌మెంట్, ప్రొఫెషనల్ కన్సెల్టెన్సీ వంటి నిర్దిష్ట రంగాల్లో ఉన్న ప్రొఫెషనల్స్ 44AA పరిధిలోకి వస్తారు. క్రీడాకారులు, ప్రోగ్రామ్ నిర్వాహకులు, న్యూస్ రిపోర్టర్లు, యాంకర్లు, అంపైర్లు & జడ్జ్‌లు, కోచ్‌లు & అసిస్టెంట్లు, ఫిజియోథెరపిస్ట్‌లు, స్టాఫ్ డాక్టర్లు, క్రీడా వార్తలు రాసే ప్రొఫెషనల్స్ కూడా 44AA కింద ఖాతా పుస్తకాలు నిర్వహించాలి.
- ఈ నిర్దిష్ట రంగాల ప్రొఫెషనల్స్ స్థూల ఆదాయం గత 3 సంవత్సరాల్లో రూ.1.50 లక్షల కంటే తక్కువగా ఉంటే... క్యాష్ బుక్, జర్నల్, లెడ్జర్, డైలీ కేస్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ వంటి పుస్తకాలను నిర్వహించాలి.
- ఒకవేళ, మీకు ఒక నిర్దిష్టమైన వృత్తి లేకుంటే, మీ స్థూల ఆదాయం గత 3 సంవత్సరాల్లో దేనిలోనైనా రూ.10 లక్షలకు మించి ఉంటే, ఖాతా పుస్తకాలు నిర్వహించాలి & వాటిని ఆడిట్ ఆఫీసర్‌కు చూపించాలి.
- మీరు సెక్షన్ 44ADA/44AF/44BB/44BBB కింద కవర్ అయి, మీ ఆదాయం పైన చెప్పిన పరిమితి కంటే తక్కువగా ఉంటే, పుస్తకాలను నిర్వహించడం ఐచ్ఛికం.
సెక్షన్ 44AD కింద పన్ను బాధ్యత
గత ఆర్థిక సంవత్సరం మీ టర్నోవర్ రూ.2 కోట్లకు మించకపోతే, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 44AD ప్రకారం, ఊహాత్మక పన్ను (presumptive taxation) విధానం ఎంచుకోవచ్చు. దీని కోసం:
- భారతదేశ నివాసి
- హిందు అవిభక్త కుటుంబం (HUF) నివాసి
- దేశంలోని భాగస్వామ్య సంస్థ
ఈ 3 కేటగిరీల్లో ఏ ఒక్కదానిలో లేకపోయినా ప్రిజెంటివ్ టాక్సేషన్‌కు అర్హత ఉండదు. ఇంకా, 80HH నుంచి 80RRB వరకు, సెక్షన్ 10A, 10B, 10AA లేదా సెక్షన్ 10BB కింద మినహాయింపులను క్లెయిమ్ చేసినా కూడా ప్రిజెంటివ్ టాక్సేషన్‌కు అర్హత లభించదు.
స్టాండర్డ్ డిడక్షన్
శాలరీడ్ టాక్స్‌పేయర్‌లా ITR-1 లేదా ITR-2ను ఫ్రీలాన్సర్ లేదా కన్సల్టెంట్ ఫైల్ చేయలేడు. అతని ఆదాయం జీతం నుంచి రాదు కాబట్టి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ కూడా పొందలేడు.
ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలి?
జీతం తీసుకునే వ్యక్తుల్లా ప్రతి సంవత్సరం ఇష్టమైన పన్ను విధానాన్ని (Tax Regime) వీళ్లు ఎంచుకోలేరు. ఈ కేటగిరీ వ్యక్తులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, ఒకసారి కొత్త విధానంలోకి మారిన తర్వాత, ఇక దానిని మార్చుకునే అవకాశం ఉండదు.
ఏ ITR ఫామ్ ఎంచుకోవాలి?
వృత్తిపరమైన ఆదాయం ఉన్న ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు ITR-3 ఫామ్ నింపాలి. ప్రిజమ్టివ్ టాక్సేషన్ స్కీమ్ ఎంచుకుంటే ITR-4 తీసుకోవాలి. రూ.75 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే, లేదా నష్టాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ITR-3 ఫారాన్ని మాత్రమే ఎంచుకోవాలి.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ కంగారు పెడుతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Provident Fund: ఈపీఎఫ్ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!
Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement: అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?