search
×

Income Tax: కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది బెటర్‌?, సులభమైన లెక్క ఇదిగో

ఏ పన్ను విధానంలో ఎక్కువ పన్ను ప్రయోజనం పొందవచ్చో అర్ధంగాక పన్ను చెల్లింపుదార్లు సతమతం అవుతున్నారు.

FOLLOW US: 
Share:

Income Tax: కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24తోపాటే, 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను లెక్కలు సమర్పించే (Income Tax Returns) సమయం కూడా ప్రారంభమైంది. అయితే, కొత్త ఆదాయ పన్ను పద్ధతి, పాత ఆదాయ పన్ను పద్ధతి అనే రెండు మార్గాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది ఎంచుకోవాలో చాలా మంది పన్ను చెల్లింపుదార్లకు ఇప్పటికీ అర్ధంగాక బుర్ర గోక్కుంటున్నారు. 

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మారిన రూల్స్‌
గత ఆర్థిక సంవత్సరంలో కూడా పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం రెండూ అమల్లో ఉన్నాయి. అయితే, అప్పుడు ఈ రెండింటికీ పెద్ద తేడా కనిపించలేదు. లెక్కలు వేసి చూస్తే, ఒక పన్ను చెల్లింపుదారు రెండింటిలో కట్టే పన్ను ఇంచుమించు ఒకేలా వచ్చింది. దీంతో, అప్పుడు తమకు తోచిన విధానాన్ని ఎంచుకున్నారు. ఈ సంవత్సరం మాత్రం కొన్ని విషయాలు మారాయి. ముఖ్యంగా, కొత్త పన్ను విధానంలో 'ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పరిమితి'ని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. మరో రూ. 50 వేలు ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) రూపంలో యాడ్‌ అవుతుంది. అంటే, రూ. 7.5 లక్షల వరకు ఆదాయం సంపాదించేవాళ్లు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, పన్ను మినహాయింపు సెక్షన్లు ఒక్కటి కూడా వర్తించవు. పాత పన్ను విధానంలో మాత్రం,  'ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పరిమితి' రూ. 5 లక్షలుగా యథాతథంగా కొనసాగుతోంది. ఈ పద్ధతిలో, వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో, ఏ పన్ను విధానంలో ఎక్కువ పన్ను ప్రయోజనం పొందవచ్చో అర్ధంగాక పన్ను చెల్లింపుదార్లు సతమతం అవుతున్నారు. 

పాత పన్ను పద్ధతా, కొత్త పన్ను పద్ధతా?
2022-23 ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం మొత్తం ఎంత, క్లెయిమ్‌ చేసుకోదగిన ఖర్చులెంత అన్నదానిని మీరు సరిగ్గా గుర్తిస్తే, ఏ పన్ను విధానం ఎంచుకోవాలో సులంభంగా అర్ధం చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ. 50 వేలతో కలిపి మొత్తం రూ. 7.5 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఆదాయం మీకు ఉన్నా, 31,200 రూపాయలు పన్ను చెల్లించాల్సి వస్తుంది. పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితి రూ. 5 లక్షలే కాబట్టి, మీరు పన్ను పరిధిలోకి రాకూడదనుకుంటే రూ. 2.5 లక్షల వరకు (7,50,000-5,00,000) మినహాయింపులను చూపించాల్సి ఉంటుంది. ఈ విధానంలో, సెక్షన్‌ 80C కింద గరిష్టంగా 1.5 లక్షల వరకు చూపించుకోవచ్చు. మరో లక్ష రూపాయల మినహాయింపుల కోసం ఇతర సెక్షన్లను వెతుక్కోవాలి, లేదా ఆయా సెక్షన్ల కిందకు వచ్చే పెట్టుబడులను ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందు నుంచే పెట్టి ఉండాలి. ఇది కాస్త కష్టమైన పనే కాబట్టి, మీ ఆదాయం రూ. 7.5 లక్షల లోపు ఉంటే కొత్త పన్ను విధానం ఎంచుకోవడం ఉత్తమ మార్గంగా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు... మీ ఆదాయం ఎక్కువగా ఉండి, ఇంటి రుణం లేకపోతే.. కొత్త పన్ను విధానం ఎంచుకోవడం బెటర్‌ ఆప్షన్‌గా చెబుతున్నారు.

ఒకవేళ, పన్ను తగ్గించుకునే వ్యయాలు, పెట్టుబడులపై మీకు ముందు నుంచే అవగాహన ఉండి, అలాంటి వ్యయాలు, పెట్టుబడులు మీ ఆదాయంలో 30 శాతం వరకు ఉంటే.. మీరు పాత పన్ను పద్ధతిని ఫాలో కావచ్చు. ముఖ్యంగా, మీకు గృహ రుణం ఉంటే.. అదే పెద్ద మినహాయింపును క్రియేట్‌ చేస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు రూ. 14 లక్షలకు మించని ఆదాయం ఉండి, పన్ను తగ్గించుకునే వ్యయాలు, పెట్టుబడులు దానిలో 30 శాతం తగ్గకుండా ఉంటే.. మీరు పాత పన్ను విధానాన్ని ఫాలో కావచ్చు, తద్వారా ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ITR ఫైల్‌ చేయవచ్చు. లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం రూ. 14 లక్షలకు మించకుండా, పన్ను తగ్గించుకునే వ్యయాలు, పెట్టుబడుల మొత్తం కూడా రూ. 4.25 లక్షలకు మించకుండా ఉంటే... ఇలాంటి సందర్భంలో కూడా మీరు పాత పన్ను విధానాన్ని ఫాలో కావచ్చు. 

ఉద్యోగులు, పాత-కొత్త విధానాల్లో దేనిని ఎంచుకుంటారో ముందుగానే సమాచారం తీసుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఇటీవలే కంపెనీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగి ఎంచుకునే మార్గాన్ని బట్టి ఆ ఆర్థిక సంవత్సరంలో TDS కట్‌ చేస్తారు. ఒక ఉద్యోగి ఏ విషయం చెప్పకపోతే.. అతను కొత్త పన్ను విధానం ఎంచుకున్నట్లు సంబంధిత సంస్థ పరిగణిస్తుంది, దానికి సంబంధించిన ఆదాయ పన్ను నిబంధనలు వర్తింపజేస్తుంది. 

Published at : 08 Apr 2023 10:22 AM (IST) Tags: CBDT ITR Tds Old Tax Regime New Income Tax Regime

ఇవి కూడా చూడండి

Income Tax: రూ.12 లక్షలు కాదు, రూ.13.70 లక్షల ఆదాయంపైనా 'జీరో టాక్స్‌'!, మీరు ఈ పని చేస్తే చాలు

Income Tax: రూ.12 లక్షలు కాదు, రూ.13.70 లక్షల ఆదాయంపైనా 'జీరో టాక్స్‌'!, మీరు ఈ పని చేస్తే చాలు

Income Tax: మీ జీతం రూ.8-25 లక్షల మధ్య ఉందా?, ఈ ఏడాది నుంచి టాక్స్‌ మీద రూ.50,000 వరకు ఆదా!

Income Tax: మీ జీతం రూ.8-25 లక్షల మధ్య ఉందా?, ఈ ఏడాది నుంచి టాక్స్‌ మీద రూ.50,000 వరకు ఆదా!

Gold-Silver Prices Today 05 Feb: చుక్కలు చూపిస్తున్న పుత్తడి ధర, ఇక కొనలేం -ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 05 Feb: చుక్కలు చూపిస్తున్న పుత్తడి ధర, ఇక కొనలేం -ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

SIP Vs PPF: నెలకు రూ.11 వేలు పెట్టుబడి పెడితే మీ రిటైర్మెంట్ నాటికి ఏది ఎక్కువ డబ్బు వస్తుంది ?

SIP Vs PPF: నెలకు రూ.11 వేలు పెట్టుబడి పెడితే మీ రిటైర్మెంట్ నాటికి ఏది ఎక్కువ డబ్బు వస్తుంది ?

Tax-Free Income: PPFతో నెలకు రూ.39,000 పైగా రాబడి - ఈ డబ్బు మొత్తానికీ 'జీరో టాక్స్‌'

Tax-Free Income: PPFతో నెలకు రూ.39,000 పైగా రాబడి - ఈ డబ్బు మొత్తానికీ 'జీరో టాక్స్‌'

టాప్ స్టోరీస్

PM Modi Holy Dip: మహా కుంభమేళాలో మోదీ, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని

PM Modi Holy Dip: మహా కుంభమేళాలో మోదీ, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని

Hyderabad Crime: హైదరాబాద్‌లో వరుస విషాదాలు - వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

Hyderabad Crime: హైదరాబాద్‌లో వరుస విషాదాలు - వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

Pushpa 2: ఓటీటీలో 'పుష్ప'గాడి ఇంటర్నేషనల్ ర్యాంపేజ్... 4 రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ వ్యూస్

Pushpa 2: ఓటీటీలో 'పుష్ప'గాడి ఇంటర్నేషనల్ ర్యాంపేజ్... 4 రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ వ్యూస్

Rashid World Record: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఘనత

Rashid World Record: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఘనత

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy