By: ABP Desam | Updated at : 14 Jul 2023 03:16 PM (IST)
ఈ విషయాలు ITRలో రిపోర్ట్ చేయకపోతే ₹10 లక్షల ఫైన్!
Tax on Foreign Income: ప్రతి వ్యక్తికి వివిధ మార్గాల్లో ఆదాయం వస్తుంటుంది. కొంతమంది దేశంలో ఉంటూ సంపాదిస్తే, మరికొందరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. ఇండియాలో కొంత కాలం పని చేసి, మంచి ఆఫర్ వచ్చి విదేశాలకు వెళ్లే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్లు ఇన్‌కం ట్యాక్స్ కట్టాలా, వద్దా?. ఒకవేళ చెల్లించాల్సి వస్తే ఎలా చెల్లించాలి, ఏయే అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి?.
ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 182 రోజులు భారతదేశంలో ఉన్నట్లయితే, అతన్ని రెసిడెంట్‌గా పరిగణిస్తారు. భారతీయ నివాసి సంపాదించే గ్లోబల్ ఇన్‌కమ్, భారతదేశ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న తరహాలోనే ఆ వ్యక్తికి టాక్స్ రేట్లు వర్తిస్తాయి.
విదేశాల నుంచి సంపాదిస్తున్న వ్యక్తి ఈ విధంగా రిపోర్ట్ చేయాలి
విదేశాల్లో అందుతున్న జీతాన్ని 'ఇన్‌కమ్ ఫ్రమ్ శాలరీ' హెడ్‌లో చూపించాలి. విదేశీ కరెన్సీలో వచ్చే జీతాన్ని రూపాయిల్లోకి మార్చి చూపాలి. మీరు పని చేస్తున్న కంపెనీ వివరాలు ఇవ్వాలి. జీతంపై ముందస్తు టాక్స్ కట్ అయితే, దానిని ఐటీ రిటర్న్‌లో చూపి, రిఫండ్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) బెనిఫిట్ ద్వారా రెండు దేశాల్లోనూ పన్ను కట్టాల్సిన ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. మీరు పని చేస్తున్న దేశంతో DTAA లేకపోతే, సెక్షన్ 91 ప్రకారం ఉపశమనం పొందవచ్చు.
ఆదాయపు పన్ను నోటీసు అందుకోవచ్చు
మన దేశంలో డిడక్షన్ లేదా ఎగ్జమ్షన్ వంటివి మీకు వర్తిస్తే, వాటిని ఉపయోగించుకోవచ్చు. సెక్షన్ 80C లేదా 80D కింద పెట్టిన పెట్టుబడులకు పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. విదేశాల్లో పొందే డిడక్షన్స్‌ను ఇక్కడ ఉపయోగించుకోలేరు. విదేశాల్లోని సంపాదిస్తే, మీ ఆదాయ పన్ను పత్రాల్లో FA (ఫారిన్ అసెట్స్) గురించి సమాచారం ఇవ్వాలి. మీకు విదేశాల్లో ఏదైనా ఆస్తి లేదా బ్యాంకు అకౌంట్ ఉంటే, దాని గురించి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సరైన సమాచారం ఇవ్వండి. మీరు సమాచారం దాచారని బయట పడితే ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ వస్తుంది.
వివరాలు దాస్తే ₹10 లక్షల జరిమానా కట్టాల్సి రావచ్చు
విదేశాల్లో సంపాదన గురించి, ఆదాయ పన్ను విభాగం, టాక్స్ పేయర్లను మరోమారు అలెర్ట్ చేసింది. దేశం వెలుపల బ్యాంక్ ఖాతా, ఆస్తులు, ఆదాయం వంటివి ఉంటే... 2023-24 అసెస్‌మెంట్ ఇయర్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఫారిన్ అసెట్స్ షెడ్యూల్ పూరించాలంటూ ట్వీట్ చేసింది.
ఒకవేళ, విదేశీ సంపాదనల గురించి టాక్స్ పేయర్ వెల్లడించకపోతే, ఆదాయ పన్ను విభాగం అతనిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు. బ్లాక్ మనీ (వెల్లడించని విదేశీ ఆదాయం & ఆస్తులు) & టాక్స్ యాక్ట్ 2015 కింద రూ. 10 లక్షల జరిమానా విధించవచ్చు.
ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి తుది గడువు 31 జులై 2023 అని గుర్తుంచుకోండి.
మరో ఆసక్తికర కథనం: ఠారెత్తిస్తున్న టొమాటో తర్వాత లైన్‌లోకి వచ్చిన కందిపప్పు, మీ పప్పులు ఉడకవు ఇక!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
PF Withdrawal: పీఎఫ్ విత్‌డ్రా చేయడానికి రెండు ప్రధాన ఆప్షన్లు, ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం
New Banking Rules: ఈ ఏప్రిల్ నుంచి మారే బ్యాంకింగ్ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
10-Minute Smartphone Delivery: స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో హోమ్ డెలివెరీ - స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దూకుడు
Cash Withdraw: ATM నుంచి డబ్బు తీసే ముందు ఓసారి ఆలోచించండి, ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్
Gold-Silver Prices Today 26 Mar: మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్, సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
RC16 First Look: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్... 'పెద్ది' ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్, ఎప్పుడో తెలుసా?
Mohammed Shami Latest News:ఉపాధి హామీ పథకంలో కూలీ డబ్బులు తీసుకుంటున్న క్రికెటర్ షమీ సోదరి, బావ
Telangana Cisco: తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి