By: ABP Desam | Updated at : 03 Jun 2023 10:48 AM (IST)
ITR ఫైలింగ్‌లో ఎక్కువ మంది చేస్తున్న తప్పులివి
ITR Filing Mistakes: ఆదాయపు పన్ను పత్రాలు దాఖలు చేసే సీజన్ వచ్చేసింది. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి తుది గడువు జులై 31, 2023. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎక్కువ మంది కొన్ని కామన్ తప్పులు చేస్తుంటారు. అలాంటి విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే, చిన్న పొరపాటు/నిర్లక్ష్యం కారణంగా ఐటీ నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది.
1. సరైన ITR ఫామ్ ఎంచుకోకపోవడం
ఒక వ్యక్తి సంపాదన, ఆదాయం, పన్ను విధించదగిన ఆదాయం ఆధారంగా ఆదాయపు పన్ను ఫారం ఎంచుకోవాలి. ITR-1 నుంచి ITR-4 వరకు ఉన్న ఫామ్స్‌ను వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం నిర్దేశించారు. మీ ఆదాయం సంవత్సరానికి 50 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే, మీరు ఆదాయపు పన్ను ఫారం-1ని ఎంచుకోవాలి. బ్యాంక్ ఎఫ్‌డీలు, ఇతర పెట్టుబడుల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నా ఇదే ఫామ్ ఫైల్ చేయాలి. సరైన ఆదాయపు పన్ను ఫారం ఎంచుకోకపోతే, ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. తప్పుడు ఫారాన్ని పన్ను విభాగం స్వీకరించదు. 15 రోజుల లోపు మళ్లీ సరైన ఫారం పూర్తి చేసి, సమర్పించాలి. మరోవైపు, పదేపదే తప్పులు చేస్తే IT నోటీసును, పెనాల్టీని భరించాల్సి వస్తుంది.
2. ఫామ్-16, ఫామ్-26AS తనిఖీ చేయకపోవడం
ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి ముందు, తప్పనిసరిగా ఫారం 26AS, ఆన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌ను (AIS) తనిఖీ చేయాలి. ఇందులో, TDS గురించి పూర్తి సమాచారం ఉంటుంది. ఆ తర్వాత, దానిని ఫారం-16తో సరిపోల్చండి. మీరు రెండు ఫారాల్లో TDS సంబంధిత తప్పు లేదా వైరుధ్యం కనిపిస్తే, వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించండి.
3. చివరి నిమిషంలో ITR దాఖలు
కొంతమంది ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన చివరి తేదీ వరకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు, ఆఖరి రోజున హడావిడి చేస్తారు. అలాంటి పరిస్థితిలో, తొందరపాటు కారణంగా తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా ముఖ్యమైన సమాచారాన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఈ కారణంగా, ఆదాయపు పన్ను నోటీసును ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి, ఎలాంటి సమస్య లేకుండా, సౌకర్యవంతంగా పని పూర్తి కావాలంటే, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయవద్దు.
4. వడ్డీ ఆదాయాలను వెల్లడించకపోవడం
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను ఫైల్ చేసేటప్పుడు, చాలా మంది పన్ను చెల్లింపుదార్లు చేసే కామన్ మిస్టేక్ ఇది. బ్యాంకులు & పోస్టాఫీసుల్లో పెట్టిన పెట్టుబడిపై వచ్చే వడ్డీ గురించి సమాచారం ఇవ్వడం మర్చిపోతుంటారు. దీనివల్ల తరువాత ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ తప్పు చేయకూడదనుకుంటే, ఫారమ్ సమర్పించే ముందే, ఫామ్ 26S & AISను క్రాస్-చెక్ చేయాలి.
5. పాత సంస్థ నుంచి వచ్చిన ఆదాయం
ఒకవేళ, ఒక వ్యక్తి ఉద్యోగం మారిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు, 2023 ఆర్థిక సంవత్సరంలో (2022 ఏప్రిల్ 1 - 2023 మార్చి 31 మధ్య కాలంలో) ఉద్యోగం/ఉద్యోగాలు మారినట్లయితే, మీ ప్రస్తుత కంపెనీతో పాటు, పాత కంపెనీ నుంచి కూడా ఫామ్ 16 తీసుకోవాలి. దీంతో, మీ పాత ఉద్యోగం & TDS గురించి సమాచారం పొందుతారు. దీనివల్ల IT డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ వంటి సమస్యల బారిన పడరు.
6. మూలధన లాభాలను చెప్పకపోవడం
షేర్లు, మ్యూచువల్ ఫండ్, బంగారం వంటి వాటి ద్వారా ఆర్జించిన లాభాలను మూలధన లాభాలుగా (Capital gain) పిలుస్తారు. ఆస్తి రకాన్ని బట్టి వీటిపై 15% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ సమర్పించే సమయంలో ఇలాంటి ఆదాయానికి సంబంధించిన సమాచారం వెల్లడించడం అవసరం. దీర్ఘకాలిక లాభాల మీద 20 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
7. బ్యాంక్ వివరాలు తప్పుగా ఇవ్వడం
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు బ్యాంకు వివరాలపై చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొన్నిసార్లు, ప్రజలు బ్యాంకు వివరాలను సరిగ్గా నింపరు. బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSCలో ఒక్క అంకెను తేడాగా నింపినా మీకు రావలసిన ప్రయోజనాలు ఆగిపోతాయి. పైగా, ఆదాయపు పన్ను నోటీసును అందుకోవాల్సి వస్తుంది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: ఫోన్ తియ్-పే చెయ్, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్
SIP Vs PPF: నెలకు రూ.11 వేలు పెట్టుబడి పెడితే మీ రిటైర్మెంట్ నాటికి ఏది ఎక్కువ డబ్బు వస్తుంది ?
Tax-Free Income: PPFతో నెలకు రూ.39,000 పైగా రాబడి - ఈ డబ్బు మొత్తానికీ 'జీరో టాక్స్'
Gold Investment: పుండు మీద కారం చల్లిన సర్కారు - చవకగా బంగారం కొనే పాపులర్ స్కీమ్ క్లోజ్!
Student Credit Card: స్టుడెంట్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు, పరిమితులు - అప్లై చేసే ముందు అన్నీ తెలుసుకోండి
8th Pay Commission Salaries: ప్యూన్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు - ఏ ఉద్యోగి జీతం ఎంత పెరుగుతుంది?
Revanth Reddy in Assembly: లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !
Revanth Reddy Chit Chat: సిరిసిల్లకు ఉపఎన్నిక వస్తుందా ?-అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను పరిగణనలోకి తీసుకోం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Viral: పెళ్లి భోజనాలు సరిపోలేదని ఘర్షణ - చివరికి పోలీస్ స్టేషన్లో పెళ్లి - ఈ జంటకు అలా రాసిపెట్టి ఉంది !
Tirupati News: కూటమికి ఓటేసి భూమన కాళ్లపై పడ్డ ముగ్గురు కార్పొరేటర్లు - బెదిరించారని గగ్గోలు