By: ABP Desam | Updated at : 11 Oct 2022 09:23 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
IMF Growth Forecast: ప్రపంచ బ్యాంకు తర్వాత, ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. ఐఎంఎఫ్ ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి 6.8 శాతంగా అంచనా వేసింది. ఇది ఐఎంఎఫ్ గతంలో వేసిన అంచనా కంటే 0.6 శాతం తక్కువ. 2022 జులైలో జీడీపీ 7.4 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
ఐఎంఎఫ్ ప్రకారం, 2022 లో భారతదేశ జిడిపి 6.8 శాతం ఉండవచ్చు. ఇది జులై అంచనా కంటే 0.6 శాతం తక్కువ. 2022 రెండవ త్రైమాసికంలో ఏప్రిల్, జున్ మధ్య వృద్ధిలో తగ్గుదలతో డిమాండ్ తగ్గడం వల్ల ఇది ప్రభావం అని ఐఎంఎఫ్ నమ్ముతోంది. అంతకుముందు జgలైలో, ఐఎంఎఫ్ జిడిపి అంచనాను 80 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.40 శాతానికి తగ్గించింది. ఐఎంఎఫ్‌కు ముందు ప్రపంచ బ్యాంకు, ఆర్‌బిఐతో సహా పలు రేటింగ్ ఏజెన్సీలు భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను తగ్గించాయి. అయితే, 2022-23లో జీడీపీ 7 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ భావిస్తోంది.
యుక్రెయిన్ పై రష్యా దాడి కారణంగా ద్రవ్యోల్బణం, ప్రజల రోజువారీ అవసరాలు చాలా ఖరీదైనవిగా మారుతున్నాయని, చైనాలో మందగమనం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఐఎంఎఫ్ ఎకనామిక్ కౌన్సిలర్ పియరీ-ఒలివియర్ గౌరింకాస్ అన్నారు. 2023లో మూడింట ఒక వంతు దేశాల ఆర్థిక వృద్ధి రేటు ప్రతికూలంగా ఉంటుందని తెలిపారు. ఇది అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనాలో అభివృద్ధి వేగంపై ప్రభావం చూపుతాయన్నారు. భావిష్యత్‌లో మాంద్యంలాంటి పరిస్థితులు చూడాల్సి ఉంటుందని అన్నారు.
ఈ మధ్యే వృద్ది రేటు తగ్గించిన ప్రపంచ బ్యాంకు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో దేశ ఆర్థిక వృద్ధిరేటు అంచనాను ప్రపంచ బ్యాంకు తగ్గించింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం, ఈ సంవత్సరం భారతదేశ జిడిపి 6.5 శాతంగా ఉంటుందని అంచనా. జీడీపీ 7.5 శాతంగా ఉంటుందని 2022 జూన్‌లో ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు సమావేశానికి ముందు దక్షిణాసియా ఎకనామిక్ ఫోకస్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఏదేమైనా, భారతదేశం మిగిలిన ప్రపంచం కంటే వేగంగా కోలుకుంటోందని ఈ నివేదిక తెలిపింది. కోవిడ్ మొదటి దశలో భారీ క్షీణత తరువాత వృద్ధి పరంగా దక్షిణాసియాలోని ఇతర దేశాల కంటే భారతదేశం మెరుగైన పనితీరును కనబరిచిందని ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా చీఫ్ ఎకనామిస్ట్ హన్స్ టిమ్మర్ అన్నారు. భారత్ విదేశీ రుణాలు ఎక్కువగా తీసుకోవడం లేదని ఇది సానుకూలమైన విషయం అని ఆయన అన్నారు. అదే సమయంలో సేవల రంగంలో, ప్రత్యేకించి సేవా ఎగుమతుల రంగంలో భారత దేశం ప్రదర్శన మెరుగ్గా ఉందన్నారు.
హన్స్ టిమ్మర్ ప్రకారం, ప్రపంచ పరిస్థితులు భారతదేశంతో సహా అన్ని దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. దీని కారణంగా వృద్ధి రేటు అంచనాను తగ్గించాల్సి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం సంకేతాలను చూపించడం ప్రారంభించిందని ఆయన అన్నారు. ద్వితీయ భాగంలో ఇతర దేశాలతోపాటు భారత్‌లో వృద్దిరేటు బలహీనంగా ఉండబోతోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. మొదటిది, అధిక-ఆదాయ దేశాల ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం మందగించింది, కఠినమైన ద్రవ్య విధానం వల్ల రుణాలు తగ్గనున్నాయి. ఈ కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి మూలధన ప్రవాహం తగ్గనుంది.
ఆర్బీఐ 2022 సెప్టెంబర్ 30 న ద్రవ్య విధానాన్ని కూడా ప్రకటించింది, ఇందులో 2022-23 లో స్థూల దేశీయోత్పత్తి 7 శాతంగా అంచనా వేసింది.
Canadian Salary: కెనడాలో C$30,000 జీతం సంపాదిస్తే భారత్‌లో దాని విలువ ఎంత? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
Money Rules: ఏప్రిల్ నుంచి మీ చేతిలో డబ్బే డబ్బు! - మీ ఇష్టానికి ఖర్చు చేయొచ్చు
TDS, TCS New Rules: ఏప్రిల్ నుంచి టీడీఎస్-టీసీఎస్‌లో కీలక మార్పులు - విదేశాల్లో చదివేవాళ్లకు భారీ ఊరట
Gold-Silver Prices Today 28 Mar: టారిఫ్‌ల దెబ్బకు మళ్లీ 92000 దాటిన పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Tax on ULIPs: 'యులిప్'లపై టాక్స్ మోత - ఏప్రిల్ నుంచి ఏం మారుతుంది?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గడ్డపై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల తర్వాత సీఎస్కేపై విక్టరీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
KKR Vs LSG Match Reschedule బీసీసీఐ కీలక నిర్ణయం- కోల్‌కతా, లక్నో మ్యాచ్ వాయిదా.. తేదీ మార్పుపై ప్రకటన