By: ABP Desam | Updated at : 15 May 2023 02:35 PM (IST)
మీ డబ్బు పొరపాటున వేరే నంబర్‌కు వెళ్లిందా?
Wrong Transferred Money: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) మన జీవనశైలిలో భాగంగా మారింది. దీనితో డబ్బు లావాదేవీలు చిటికె వేసినంత సులభంగా మారాయి. దీంతోపాటే కొన్ని ప్రమాదాలు చేరవయ్యాయి. UPI ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో ఫోన్ నంబర్‌లో ఒక్క అంకె పొరపాటు జరిగినా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ఖాతా నుంచి ఖాతాకు పంపే సమయంలో, అవతలి వ్యక్తి ఖాతా నంబర్‌ను తప్పుగా రిజిస్టర్ చేసినా డబ్బులు ఎవరికో వెళ్లిపోతాయి.
UPI లావాదేవీ లేదా అకౌంట్ టు అకౌంట్ లావాదేవీలో మీ డబ్బు పొరపాటున వేరే ఎవరికైనా వెళ్లినప్పుడు మీరు వెంటనే స్పందిస్తే మీ సొమ్మును రికవరీ చేసుకోవచ్చు.
బ్యాంక్ బ్రాంచ్ లేదా కస్టమర్ కేర్
పొరపాటున వేరే నంబర్‌కు డబ్బు పంపితే, ముందుగా మీ బ్యాంక్ ఖాతా చెక్ చేయండి. మీ ఖాతా నుంచి డబ్బు తగ్గితే, ఆలస్యం చేయకుండా మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లండి. బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కూడా కాల్ చేయవచ్చు. ఫోన్ నంబర్, లావాదేవీ సంఖ్య, లావాదేవీ మొత్తం, ఏ ఖాతా నుంచి డబ్బు కట్ అయింది, ఏ ఖాతాకు లేదా ఫోన్ నంబర్‌కు డబ్బు బదిలీ అయింది, లావాదేవీ తేదీ, సమయం వంటి వివరాలను బ్యాంక్‌కు తెలియజేయండి. డబ్బు కట్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి మీకు వచ్చే ఈ-మెయిల్‌లో ఈ వివరాలన్నీ ఉంటాయి.
ఈ-మెయిల్‌లో కూడా బ్యాంక్‌కు ఫిర్యాదు చేయవచ్చు. సంబంధింత వివరాలన్నింటినీ ఈ-మెయిల్‌లో వివరించండి. ఇలాంటి సందర్భంలో, పొరపాటున ఆ లావాదేవీ చేశారా అని బ్యాంకులు మిమ్మల్ని అడుగుతాయి. ఇలా తప్పనిసరిగా అడగాలన్నది రిజర్వ్ బ్యాంక్ పెట్టిన రూల్.
ఖాతా నుంచి ఖాతాకు డబ్బు పంపినప్పుడు, IFSC నంబర్‌ను తప్పుగా నమోదు చేయడం లేదా ఆ బ్యాంక్ ఖాతా యాక్టివేట్‌లో లేకపోవడం వంటివి కూడా జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనూ మీ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుంది. అయితే, కంగారు పడొద్దు, కట్ అయిన డబ్బు మొత్తం ఆటోమేటిక్‌గా మీ ఖాతాలో తిరిగి క్రెడిట్ అవుతుంది. ఒకవేళ డబ్బు రాకపోతే, మీ బ్యాంకు శాఖకు వెళ్లి మేనేజర్‌కి ఫిర్యాదు చేయవచ్చు. మీ డబ్బు కొన్ని రోజుల్లో తిరిగి వస్తుంది.
ఈ నంబర్ UPIకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది
UPI ద్వారా డబ్బు పంపడంలో పొరపాటు చేసినట్లయితే, వెంటనే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. Paytm, PhonePe, Amazon Pay, Google Pay సహా అన్ని చెల్లింపు యాప్‌లు లావాదేవీ తర్వాత రిసిప్ట్‌ను షేర్ చేయడానికి లేదా సేవ్ చేయడానికి ఆప్షన్ అందిస్తున్నాయి. మీరు దీన్ని అలవాటుగా మార్చుకుంటే, అన్ని లావాదేవీల చరిత్ర మీ వద్ద ఉంటుంది, ఎప్పుడైనా పొరపాటు జరిగినప్పుడు ఉపయోగపడుతుంది. UPI ద్వారా తప్పుడు బదిలీల గురించి ఫిర్యాదు చేయడానికి 18001201740 నంబర్‌కు కాల్ చేయండి, ఇది టోల్ ఫ్రీ నంబర్.
ప్రాసెస్ చేసిన బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి
టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోతే, మీరు బ్రాంచ్‌కు వెళ్లండి. మీరు డబ్బు పంపిన ఖాతా, మీ ఖాతా రెండూ ఒకే బ్రాంచ్‌కు చెందినవి అయితే, మీ డబ్బు త్వరగా వాపసు అవుతుంది. డబ్బు పోయిన ఖాతా మరొక బ్యాంక్ లేదా బ్రాంచ్‌కు చెందినదైతే, డబ్బు తిరిగి పొందడంలో కొద్దిగా ఆలస్యం కావచ్చు, రెండు నెలల వరకు పట్టవచ్చు. లావాదేవీని ఏ బ్రాంచ్ ప్రాసెస్ చేసిందన్న ఈ సమాచారాన్ని బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. మీరు నేరుగా అదే బ్రాంచ్‌ను సంప్రదించండి. నేరుగా ఆ బ్రాంచ్‌కు వెళ్లడం వల్ల డబ్బు వాపసులో ఆలస్యం తగ్గుతుంది. ఆ బ్రాంచ్ సదరు కస్టమర్‌ని సంప్రదించి, డబ్బు తిరిగి ఇవ్వమని కోరుతుంది.
ఇదే చివరి ప్రయత్నం
పొరపాటున మీ డబ్బు పొందినవాళ్లు ఆ డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే, వాపసు ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో, మీరు కోర్టు సహాయం తీసుకోవలసి ఉంటుంది. కోర్టు నుంచి నోటీసు పంపడం ద్వారా చట్టపరమైన చర్య ప్రారంభించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులను నిందితులుగా చూడపడం కుదరదని రిజర్వ్ బ్యాంక్ నిబంధన చెబుతోంది. తప్పుడు లావాదేవీ బాధ్యత మొత్తం మీదే అవుతుంది.
ఎవరికైనా డబ్బు పంపే ముందు వివరాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. UPI ద్వారా డబ్బు పంపుతున్నట్లయితే, ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత లేదా QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత, అక్కడ కనిపించే ఖాతాదారు పేరును చెక్ చేయండి. ఇలా చేయడం వల్ల తప్పు జరిగే అవకాశం ఉండదు.
ఇది కూడా చదవండి: డీమార్ట్ తోక కత్తిరింపు, ఈ షేర్లు మీ దగ్గరుంటే జాగ్రత్త సుమీ!
PAN Card: ఇక నుంచి QR కోడ్‌తో కొత్త పాన్ కార్డ్‌లు - "ఫ్రీ"గా తీసుకోవచ్చు
Car Insurance: కారు బీమా - వారెంటీల విషయంలో ఓనర్‌లకు ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవీ
Gold Rate Ttoday: రూ.1,300 తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
NTPC Green Energy IPO: ఎన్‌టీపీసీ గ్రీన్ ఐపీవో అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇంట్లో కూర్చునే ఇలా చెక్ చేయండి
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స