By: Arun Kumar Veera | Updated at : 25 Sep 2024 03:10 PM (IST)
ఈ తప్పుల వల్ల మీ ఈపీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది ( Image Source : Other )
Reasons For Your EPF Claim Rejection: ఉద్యోగులు, తమ భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్‌కి కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. ఉద్యోగి జమ చేసే డబ్బును EPFO మేనేజ్ చేస్తుంటుంది. అది మీ డబ్బే అయినప్పటికీ, మీకు అవసరమై విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు మీ క్లెయిమ్‌ను EPFO తిరస్కరిస్తుంది. చాలామంది విషయంలో చాలాసార్లు ఇది జరుగుతుంది.
మీరు జమ చేసిన డబ్బును వెనక్కు తీసుకోవాలనుకున్నప్పుడు EPFO ఎందుకు తిరస్కరిస్తుంది?. దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. వాస్తవానికి, మీ డబ్బు మోసగాళ్లకు చేరకుండా అడ్డుకోవడానికి ఈపీఎఫ్‌వో ఒక్కోసారి విత్‌డ్రా క్లెయిమ్‌ను తిరస్కరిస్తుంది. ఈపీఎఫ్‌వో మెంబర్ చేసే చిన్న పొరపాట్ల వల్ల ఇది తరచుగా జరుగుతుంది. మీరు కొంచెం జాగ్రత్త తీసుకుంటే, EPF క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా చూసుకోవచ్చు. మీరు ఇలాంటి సమస్యలో చిక్కుకోకుండా ఉండాలంటే, రిజెక్షన్ సమస్యను పుట్టించే ఆ చిన్న పొరపాట్లు ఏవో తెలుసుకోవాలి.
తిరస్కరణకు సంబంధించి పూర్తి సమాచారం EPFO ఇవ్వదు
క్లెయిమ్ తిరస్కరించినప్పుడు, చాలా సందర్భాల్లో, EPFO పోర్టల్ మీకు పూర్తి వివరాలను అందించదు. అసంపూర్ణ పత్రాలు అందించారని లేదా సమాచారం ఇవ్వడంలో తప్పులు దొర్లాయని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీనిని బట్టి ఆ తప్పు ఎక్కడ జరిగిందో అర్థం చేసుకోవడం చందాదార్లకు కష్టంగా మారుతుంది. తాను ఏ తప్పు/పొరపాటు చేశాడో కూడా తెలీనప్పుడు, ఆ తప్పు/పొరపాటును సరి చేసుకోవడానికి ఏం చేయాలో కూడా EPFO సబ్‌స్క్రైబర్‌కి తెలీదు. కళ్ల ఎదుట ఉన్న డబ్బును ఎలా తీసుకోవాలో, దానికి ఏం చేయాలో అర్ధంగాక తల పట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది.
ఈ కారణాల వల్ల విత్‌డ్రా క్లెయిమ్‌ను EPFO తిరస్కరిస్తుంది:
-- అసంపూర్ణంగా ఉన్న కేవైసీ (KYC)
-- యూనివర్శల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్ నంబర్‌ను లింక్ చేయకపోవడం
-- చందాదారు పేరు & పుట్టిన తేదీలో తప్పు
-- EPFO రికార్డులు & ఫామ్‌లో ఇచ్చిన UANలో తేడా
-- ఉద్యోగంలో చేరిన తేదీ & నిష్క్రమించిన తేదీ రికార్డులకు భిన్నంగా ఉండడం
-- కంపెనీ వివరాలను తప్పుగా నింపడం
-- బ్యాంక్ ఖాతా వివరాలను తప్పుగా నింపడం
-- క్లెయిమ్ ఫారం నింపేటప్పుడు తప్పులు చేయడం
-- EPS ట్రాన్స్‌ఫర్ వైఫల్యం
-- EPS ఖాతా సరిగ్గా లేకపోడం (బేసిక్ పే రూ. 15,000 కంటే ఎక్కువగా ఉండడం)
-- అనెక్చర్ విషయంలో వైఫల్యం
ఈ తప్పులను మీరు ఎలా సరి చేయవచ్చు?
-- EPFO రికార్డులు & ఆధార్ డేటాను చెక్ చేయండి
-- UANని ఆధార్ నంబర్‌తో లింక్ చేయండి
-- PF నామినేషన్‌ను అప్‌డేట్ చేయండి
-- మునుపటి ఉద్యోగాల రికార్డులను అప్‌డేట్ చేయండి
-- మొత్తం బ్యాంక్ ఖాతా సమాచారాన్ని ఓసారి చెక్ చేసి, అప్‌డేట్ చేయండి
-- పెన్షన్ సర్టిఫికేట్ తీసుకోండి
-- క్లెయిమ్ సమర్పించే ముందు ప్రతి విషయాన్ని రెండోసారి జాగ్రత్తగా తనిఖీ చేయండి
-- క్లెయిమ్ సమయంలో సమర్పించిన అన్ని పత్రాల కాపీలను సేవ్ చేసుకోండి
మరో ఆసక్తికర కథనం: పండుగ సీజన్‌లో పసిడి మంట - రికార్డ్ స్థాయిలో గోల్డ్, రూ.80 వేలు దాటే ఛాన్స్
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Rupee Weakening Effect in India:రూపాయి బలహీనపడటం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఏ రంగాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
Gold Price: బంగారం రన్ ఇప్పట్లో ఆగదా! ధర 1.50 లక్షలకు చేరుకుంటుందా?
Railway Tatkal Ticket Booking Rules: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ మారాయి - ఇకపై OTP తప్పనిసరి!
Birmingham Fire Accident: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం! ఇద్దరు తెలుగు విద్యార్దులు మృతి
Indigo Issue: ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
Russia India trade ties: మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
Hawala money seizure: కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?