By: ABP Desam | Updated at : 07 Oct 2022 07:16 AM (IST)
Edited By: Shankard
బంగారం, వెండి ధరలు
Gold Rate Today 07 October 2022: బులియన్ మార్కెట్‌లో గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. తాజాగా వరుసగా నాలుగోరోజు పసిడి ధర ఎగబాకింది. పసిడికి భిన్నంగా వెండి ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో మూడు రోజుల్లోనే రూ.1100 మేర పెరగడంతో ఇక్కడ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,200 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 గా ఉంది. పసిడి ధర భారీగా పెరగగా, రూ.500 తగ్గడంతో హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర నేడు రూ.66,500గా ఉంది.
కరీంనగర్, వరంగల్‌లో బంగారం ధర తాజాగా రూ.100 పెరిగింది. మూడు రోజుల్లో గమనిస్తే రూ.1100 మేర భారీగా పెరిగింది. దీంతో ఈ తెలంగాణ నగరాలలో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,200 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,850 గా ఉంది. ఈ పట్టణాల్లో వెండి నేడు వెండి 1 కేజీ ధర రూ.66,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ సైతం నేడు రూ.500 మేర తగ్గింది.
ఏపీలో బంగారం ధరలు. (Gold Rate Today In AP)
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 07 October 2022) 10 గ్రాముల ధర రూ.52,200 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,850 గా ఉంది. రూ.500 దిగిరావడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.66,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
రూ.100 పెరగడంతో విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,850, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో రూ.500 మేర పతనం కావడంతో 1 కేజీ వెండి ధర రూ.66,500 అయింది.
ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు..
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా రూ.110 మేర పెరిగింది. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,360 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.48,800 కు చేరుకుంది. ఢిల్లీలో వెండి ధర రూ.500 పతనమైంది. 1 కేజీ వెండి ధర రూ.61,500 కి క్షీణించింది.
చెన్నైలో రూ.50 పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,800 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. చెన్నైలో 1 కేజీ బంగారం ధర రూ.66,500కి పడిపోయింది.
ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200 అయింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 కి చేరుకుంది. 1 కేజీ వెండి ధర రూ.61,500 గా ఉంది.
పెరిగిన ప్లాటినం ధర
దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో ప్లాటినం ధరలు పెరిగాయి. అయితే ముంబైలో రూ.7 పెరగడంతో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,230 అయింది. హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాములకు ధర రూ.24,230 అయింది. ఢిల్లీలోనూ అవే ధరలున్నాయి.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Gold-Silver Prices Today 23 Dec: రూ.78 వేల దగ్గర బంగారం, రూ.99 వేల దగ్గర వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Travel Credit Cards: సెలవుల సంతోషాన్ని రెట్టింపు చేసే ట్రావెల్ క్రెడిట్ కార్డ్స్ - రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్స్
Zomato News: చరిత్ర సృష్టించిన జొమాటో, కేవలం మూడున్నరేళ్లలోనే బంపర్ రికార్డ్
Gold-Silver Prices Today 22 Dec: గోల్డ్ షోరూమ్‌కు వెళ్లే ముందు రేట్లు తెలుసుకోండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Housing Loan: హోమ్ లోన్ మీరు తీసుకోండి, గ్యారెంటీ గవర్నమెంట్ ఇస్తుంది - ఆస్తి పేపర్ల తనఖా అక్కర్లేదు!
Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్