By: ABP Desam | Updated at : 20 Jul 2023 03:25 PM (IST)
థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల నుంచి కూడా ITR ఫైల్ చేయొచ్చు
ITR Online Filing: మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చాలా దారులు ఉన్నాయి. ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా మీ సొంతంగానే మీ ITR ఫైల్ చేయొచ్చు లేదా, చార్టర్డ్ అకౌంటెంట్ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు లేదా, Clear (గతంలో ClearTax), Tax2Win, TaxBuddy, Quicko వంటి ఆన్‌లైన్ థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఆదాయ పన్ను శాఖ పోర్టల్‌ను ఉపయోగించి ITRను ఫ్రీగా ఫైల్ చేయొచ్చు. CA దగ్గరకు వెళ్తే కొంత డబ్బు వసూలు చేస్తాడు. ఆన్‌లైన్ థర్డ్-పార్టీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వెబ్‌సైట్‌ను ఉపయోగించినందుకు కూడా ఛార్జ్ చెల్లించాలి. Clear, TaxBuddy, Tax2Win, Taxspanner, myITReturn, Quicko వంటి పాపులర్ పోర్టల్స్ ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి తలో విధంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
ITR ఫైల్ చేయడానికి థర్డ్-పార్టీ పోర్టల్స్ వసూలు చేస్తున్న ఫీజ్‌లు:
ఎవరి సాయం లేకుండా ఐటీఆర్ పైల్ చేస్తే...
Clear
శాలరీడ్ ఎంప్లాయిస్‌కు ఛార్జ్: రూ. 299 నుంచి రూ. 1098 | క్యాపిటల్ గెయిన్స్: రూ. 1848 | వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA): రూ. 1949 నుంచి రూ. 2,999 | ఫారిన్ ఇన్‌కమ్: రూ. 2248
Tax2Win
శాలరీడ్ ఎంప్లాయిస్‌కు ఛార్జ్: రూ. 249 నుంచి రూ. 649 | క్యాపిటల్ గెయిన్స్: రూ. 249 నుంచి రూ. 649 | వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA): ఈ సైట్‌లో వీలు కాదు | ఫారిన్ ఇన్‌కమ్: ఈ సైట్‌లో వీలు కాదు
TaxSpanner
శాలరీడ్ ఎంప్లాయిస్‌కు ఛార్జ్: రూ. 399 | క్యాపిటల్ గెయిన్స్: ఈ సైట్‌లో వీలు కాదు | వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA): ఈ సైట్‌లో వీలు కాదు | ఫారిన్ ఇన్‌కమ్: ఈ సైట్‌లో వీలు కాదు
myITreturn
శాలరీడ్ ఎంప్లాయిస్‌కు ఛార్జ్: రూ. 250 నుంచి రూ. 500 | క్యాపిటల్ గెయిన్స్: రూ. 500 నుంచి రూ. 1000 | వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA): ఈ సైట్‌లో వీలు కాదు | ఫారిన్ ఇన్‌కమ్: రూ. 1000
ఇంతకుముందు ఈ వెబ్‌సైట్లలో కొన్ని, ఎక్స్‌పర్ట్స్ సాయం లేకుండా ITR-1, ITR-4 ఫైలింగ్‌ను ఉచితంగా అందించాయి. అసిస్టెన్స్ తీసుకున్నా, తీసుకోకున్నా కొన్నేళ్లుగా ఫీజ్ వసూలు చేయడం ప్రారంభించాయి. అయితే, ఇప్పటికీ కొన్ని వర్గాల వాళ్లకు ఫ్రీగా సర్వీస్ అందిస్తున్నాయి. ఉదాహరణకు... myITreturn వెబ్‌సైట్ ఉచిత ఫైలింగ్ ఆప్షన్ ఉంది. నిరుద్యోగులు, కుటుంబ పెన్షన్ తీసుకుంటున్న వితంతువులు, విద్యార్థులు, రిటైర్డ్ వ్యక్తులకు ఫ్రీ ఫైలింగ్ ఫెసిలిటీ అందిస్తోంది. మరికొన్ని వెబ్‌సైట్స్‌లోనూ ఇలాంటి వెసులుబాట్లు అందుబాటులో ఉన్నాయి.
కంప్యూటరైజ్డ్ అసిస్టెన్స్‌తో ఐటీఆర్ పైల్ చేస్తే...
Clear
జీతం, అద్దె, ఇతర వనరుల ఆదాయం: రూ. Rs 1,399 నుంచి రూ. 1949 | క్యాపిటల్ గెయిన్స్: రూ. Rs 3,499 నుంచి రూ. 5,849 | వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA): రూ. 3,999 స్టాక్ మార్కెట్ ట్రేడింగ్: రూ. 4,549
TaxBuddy
జీతం, అద్దె, ఇతర వనరుల ఆదాయం: రూ. 799 | క్యాపిటల్ గెయిన్స్: రూ. 2,399 | వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA): రూ. 5,999 | స్టాక్ మార్కెట్ ట్రేడింగ్: రూ. 3,999
Tax2Win
జీతం, అద్దె, ఇతర వనరుల ఆదాయం: రూ. Rs 849 నుంచి రూ. 1,149 | క్యాపిటల్ గెయిన్స్: రూ. 2,799 | వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA): ఈ సైట్‌లో వీలు కాదు | స్టాక్ మార్కెట్ ట్రేడింగ్: ఈ సైట్‌లో వీలు కాదు
TaxSpanner
జీతం, అద్దె, ఇతర వనరుల ఆదాయం: రూ. 799 | క్యాపిటల్ గెయిన్స్: రూ. 3,499 | వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA): ఈ సైట్‌లో వీలు కాదు | స్టాక్ మార్కెట్ ట్రేడింగ్: రూ. 3,499
myITreturn
జీతం, అద్దె, ఇతర వనరుల ఆదాయం: రూ. 2,000 నుంచి రూ. 3,500 | క్యాపిటల్ గెయిన్స్: రూ. 3,500 నుంచి రూ. 5000 | వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA): రూ. 3500 నుంచి రూ. 500 | స్టాక్ మార్కెట్ ట్రేడింగ్: రూ. 3,500 నుంచి రూ. 5000
Quicko
జీతం, అద్దె, ఇతర వనరుల ఆదాయం: రూ. 1,499 | క్యాపిటల్ గెయిన్స్: రూ. 2,999 | వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA): ఈ సైట్‌లో వీలు కాదు | స్టాక్ మార్కెట్ ట్రేడింగ్: రూ. 3,999
మరో ఆసక్తికర కథనం: మూడేళ్ల ఎఫ్‌డీకి 8% వడ్డీ ఇస్తున్న బ్యాంకులివి, ఏది సెలక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత