By: ABP Desam | Updated at : 19 Dec 2023 01:33 PM (IST)
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా క్రెడిట్ కార్డ్ పొందొచ్చు
Get a Credit Card even at Low Credit Score: క్రెడిట్ కార్డ్ ఇచ్చే బ్యాంక్‌లు/ఆర్థిక సంస్థలు మొదట చూసేది, అప్లై చేసుకున్న వ్యక్తి క్రెడిట్ స్కోర్/సిబిల్ స్కోర్ (Credit Score/CIBIL Score). సాధారణంగా, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్లకు మాత్రమే ఏ బ్యాంక్ అయినా క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. మంచి స్కోర్ లేని వ్యక్తులకు క్రెడిట్ కార్డ్ దొరకడం దాదాపు కష్టం. అయితే, బ్యాడ్/పూర్ క్రెడిట్ స్కోర్ (Bad or Poor Credit Score) ఉన్నా కూడా, కచ్చితంగా క్రెడిట్ కార్డ్ పొందే మార్గం ఒకటి ఉంది. దీనిని మీరు ఫాలో అయితే, బ్యాంక్‌లు మరోమాట మాట్లాడకుండా, కనీసం మీ క్రెడిట్ స్కోర్ కూడా చూడకుండా కార్డ్ జారీ చేస్తాయి.
క్రెడిట్ స్కోర్ అంటే? (What is Credit Score?)
క్రెడిట్ స్కోర్ మీ ఆర్థిక క్రమశిక్షణను వివరిస్తుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే వివిధ రకాల రుణాలు (Loans), 'బయ్ నౌ పే లేటర్' (Buy now pay later) వంటివాటిని సక్రమంగా తిరిగి చెల్లిస్తున్నామో లేదో చెప్పే మూడు అంకెల నంబర్ క్రెడిట్ స్కోర్. ఇది 300-900 మధ్య ఉంటుంది. మీ పాన్ ఆధారంగా మీ క్రెడిట్ హిస్టరీని క్రెడిట్ కంపెనీలు రికార్డ్ చేస్తాయి. తీసుకున్న రుణాల మీద చేసే రీపేమెంట్స్ ఆధారంగా 300-900 మధ్య ఒక నంబర్‌ను క్రెడిట్ స్కోర్‌గా మీకు కేటాయిస్తాయి. అదే మీ క్రెడిట్ స్కోర్.
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా క్రెడిట్ కార్డ్ పొందొచ్చు!
పూర్ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులు కూడా క్రెడిట్ కార్డును పొందాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit - FD) ద్వారా సాధ్యమవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), SBM బ్యాంక్ (ఇండియా) సహా మరికొన్ని బ్యాంక్‌లు తమ FD ఖాతాదార్లకు క్రెడిట్ స్కోర్‌తో సంబంధం లేకుండా క్రెడిట్ కార్డ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్ పరిమితి FDలో 80- 90% వరకు ఉంటుంది. కార్డ్ హోల్డర్ నెలవారీ ఔట్ స్టాండింగ్ చెల్లించకపోతే, ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి ఆ మొత్తాన్ని బ్యాంక్ తీసుకుంటుంది. FDలపై ఇచ్చే క్రెడిట్ కార్డ్‌లపై టాక్స్‌లు, ఛార్జీలు ఇతర రకాల కార్డ్‌ల కంటే తక్కువగా ఉంటాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద ఇచ్చే క్రెడిట్ కార్డ్‌లు (Credit card against fixed deposit)
ఎస్‌బీఐ కార్డ్ ఉన్నతి (SBI Card Unnati)
ఎస్‌బీఐ కార్డ్ ఉన్నతిపై నాలుగేళ్ల వరకు ఎలాంటి ఛార్జీ ఉండదు, ఫ్రీగా వాడుకోవచ్చు. ఐదో సంవత్సరం నుంచి ప్రతి ఏటా రూ. 499 చెల్లించాలి. రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ FD ఉంటే ఈ కార్డ్‌ను బ్యాంక్ జారీ చేస్తుంది.
ఐసీఐసీఐ ఇన్‌స్టంట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ (ICICI Instant Platinum Credit Card)
ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారంగా, ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టంట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ వస్తుంది. చాలా త్వరగా, ఉచిత క్రెడిట్ కార్డ్ పొందడానికి ఇది ఉత్తమ మార్గం. ఇందులో జాయినింగ్ లేదా యాన్యువల్ ఫీజ్ ఉండదు.
యాక్సిస్ బ్యాంక్ ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డ్ (Axis Bank Insta Easy Credit Card)
FD మొత్తంలో 80% వరకు ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ పరిమితిగా జారీ చేస్తారు. ఔట్‌స్టాండింగ్ లేకపోతే 50 రోజుల పాటు ఉచిత క్రెడిట్ అందుబాటులో ఉంటుంది.
BoB అష్యూర్ క్రెడిట్ కార్డ్ (Bank of Baroda Assure credit card)
దీనిలో, అత్యవసర సమయంలో క్రెడిట్ పరిమితిలో 100% వరకు ఉపసంహరించుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది ఈక్విటీ ఫండ్స్‌లో సగం తుస్, బెంచ్‌మార్క్‌ల కన్నా తక్కువ రాబడి
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?