By: ABP Desam | Updated at : 10 Aug 2023 02:32 PM (IST)
మీ పిల్లల చదువుల కోసం ₹7 లక్షలు ఇచ్చే పాలసీ ఇది
LIC Jeevan Tarun Policy: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) నుంచి చాలా పథకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల చదువుల దగ్గర నుంచి, పెద్ద వాళ్ల పదవీ విరమణ జీవితం వరకు.. లైఫ్‌లో ప్రతి సందర్భాన్ని నల్లేరు మీద నడకలా మార్చే పథకాలను ఈ బీమా సంస్థ అమలు చేస్తోంది. పాలసీదారు ఉన్నా, లేకున్నా ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది రాకుండా జీవిత బీమా కవరేజ్ కూడా అందిస్తోంది. అందుకే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పాలసీల్లో డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే జనాభా పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, పెట్టుబడికి గ్యారెంటీ ఉంటుంది.
LIC, దేశంలోని ప్రతి వయస్సు వాళ్లకు, ప్రతి ఆర్థిక తరగతి కోసం విభిన్న పథకాలను రన్ చేస్తోంది. పిల్లల కోసమే ప్రత్యేకంగా కొన్ని పథకాలు (LIC Policy for Children) రూపొందించింది. అలాంటి పాలసీల్లో ఒకటి ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ (LIC Jeevan Tarun Policy). దీనిని కొనుగోలు చేస్తే, మీ పిల్లల చదువుల ఖర్చు టెన్షన్‌కు తెర పడుతుంది.
జీవన్ తరుణ్ కోసం పిల్లల వయస్సు ఎంత ఉండాలి?
LIC జీవన్ తరుణ్ పాలసీని కొనుగోలు చేయాలంటే, మీ పిల్లల వయస్సు కనిష్టంగా 3 నెలలు - గరిష్టంగా 12 సంవత్సరాలు ఉండాలి. మీ సంతానానికి 20 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పెట్టుబడిని కంటిన్యూ చేయవచ్చు. ఆ తర్వాత, 5 సంవత్సరాల పాటు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు. ఆ తర్వాత మీ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే, మీ పిల్లల వయస్సు 25 సంవత్సరాలు నిండిన తర్వాత, వాళ్లకు మొత్తం డబ్బును ఎల్‌ఐసీ తిరిగి చెల్లిస్తుంది. ఆ డబ్బుతో పిల్లల ఉన్నత చదువులు (higher studies), పెళ్లి ఖర్చుల (wedding expenses) భయం ఉండదు.
కనీస హామీ మొత్తం ఎంత?
ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఖచ్చితంగా, కనీసం రూ. 75,000 హామీ మొత్తాన్ని (Basic Sum Assured) పొందుతారు. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు, మీరు కట్టే ప్రీమియంను బట్టి బేసిక్ సబ్ అజ్యూర్డ్ పెరుగుతుంది. ఈ పథకం కింద ప్రీమియం కట్టడానికి రకరకాల ఆప్షన్లు కూడా ఉన్నాయి. నెలకు ఒకసారి, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు. జీవన్ తరుణ్ పాలసీ అనేది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్ ప్లాన్. స్వల్పకాలిక అవసరాల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
మెచ్యూరిటీ తేదీన ఎంత డబ్బు వస్తుంది?
ఒక వ్యక్తి, 12 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లల కోసం ఈ పాలసీని కొనుగోలు చేశాడని అనుకుందాం. అతను, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రూ. 150 పక్కన పెడితే, సంవత్సరానికి దాదాపు రూ. 54,750 అవుతుంది. ఆ డబ్బును ఏడాది ప్రీమియంగా డిపాజిట్ చేయవచ్చు. అలా 8 సంవత్సరాల కాలంలో (సంతానానికి 20 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు) మొత్తం రూ. 4.38 లక్షలు డిపాజిట్ చేస్తాడు. దీనిపై రూ. 2.47 లక్షలను బోనస్‌గా LIC చెల్లిస్తుంది. ఇప్పుడు, 25 సంవత్సరాల వయస్సులో అతను సుమారు 7 లక్షల రూపాయలు తిరిగి తీసుకుంటాడు.
మరో ఆసక్తికర కథనం: ముచ్చటగా మూడోసారీ ఊరట - రెపో రేట్ యథాతథం, EMIలపై అదనపు భారం లేదు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్