By: Arun Kumar Veera | Updated at : 29 Jan 2025 11:22 AM (IST)
పేమెంట్ అగ్రిగేటర్లపై జీరో GST ( Image Source : Other )
No GST On Penalty Charges Levied By Banks And NBFCs: సాధారణంగా, రుణ గ్రహీత లోన్ షరతులను పాటించకపోతే, బ్యాంకులు & నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) జరిమానాలు విధిస్తుంటాయి. ఇకపై, బ్యాంక్‌లు & NBFCలు విధించే పెనాల్టీలపై 'గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్' (GST) వర్తించదు. ఈ విషయాన్ని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (Central Board of Indirect Taxes and Customs - CBIC) ఒక సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో పేమెంట్ అగ్రిగేటర్ల సాయంతో జరిపే రూ. 2000 వరకు లావాదేవీలపైనా కూడా జీఎస్‌టీ ఉండదని 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ & కస్టమ్స్' తెలిపింది.
55వ జీఎస్‌టీ మండలి సిఫార్సు
బ్యాంకులు & ఎన్‌బీఎఫ్‌సీలు విధించే పెనాల్టీ ఛార్జీలపై జీఎస్‌టీ వర్తించే అంశాన్ని స్పష్టం చేస్తూ, ఆర్‌బీఐ (RBI) నియంత్రణలో ఉన్న సంస్థలు తన కస్టమర్లు ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు పెనాల్టీ ఛార్జీలను విధిస్తాయని సీబీఐసీ తెలిపింది. 55వ జీఎస్‌టీ మండలి (GST Council) సిఫార్సు ప్రకారం, రుణగ్రహీత, తన రుణ ఒప్పందంలోని నిబంధనలను పాటించనందుకు నియంత్రిత సంస్థలు (బ్యాంక్‌లు & NBFCలు) విధించే జరిమానా ఛార్జీలపై ఎటువంటి GST చెల్లించరని CBIC స్పష్టం చేసింది. CBIC సర్క్యులర్‌పై మార్కెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివరణతో సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి కాబట్టి ఇది కీలక సర్క్యులర్ అని టాక్స్ నిపుణులు చెబుతున్నారు.
పేమెంట్ అగ్రిగేటర్లపై జీరో GST
పేమెంట్ అగ్రిగేటర్లపై GST విధింపుపైనా 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ & కస్టమ్స్' ఒక స్పష్టత ఇచ్చింది. క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, ఛార్జ్ కార్డ్‌లు లేదా ఇతర ఇతర పేమెంట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలకు సంబంధించి, రూ. 2,000 వరకు సెటిల్‌మెంట్ (Payment settlement)పై పేమెంట్ అగ్రిగేటర్స్‌కు (Payment Aggregators) జీఎస్‌టీ మినహాయింపు ఉంటుందని సీబీఐసీ తన సర్క్యులర్‌లో పేర్కొంది. ఒక లావాదేవీలో (Single Transaction) రూ. 2,000 వరకు జరిపే పేమెంట్ సెటిల్‌మెంట్‌లకు జీఎస్‌టీ మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. అయితే, పేమెంట్ సెటిల్‌మెంట్‌లకు మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందని, పేమెంట్ గేట్‌వే (Payment Gateway) సేవలకు ఇది వర్తించదని CBIC స్పష్టంగా వివరించింది. పేమెంట్ అగ్రిగేటర్స్ 'అక్వైరింగ్ బ్యాంక్' (Acquiring Bank) నిర్వచనం కిందకు వస్తాయి కాబట్టి ఈ మినహాయింపు లభిస్తుందని చెప్పింది
క్రెడిట్ కార్డ్‌లు (Credit cards), డెబిట్ కార్డ్‌లు (Debit cards), ఛార్జ్ కార్డ్‌లు లేదా ఇతర ఇతర పేమెంట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలకు సంబంధించి, పేమెంట్ అగ్రిగేటర్‌లకు GST మినహాయింపుపై స్పష్టత కోరుతూ వివిధ వర్గాల నుంచి CBIC విజ్ఞప్తులు అందుకుంది. పేమెంట్ అగ్రిగేటర్‌లు అంటే.. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు & వ్యాపారులు తమ కస్టమర్‌ల నుంచి చెల్లింపులను ఆమోదించడానికి వీలు కల్పించే సంస్థలు.
మరో ఆసక్తికర కథనం:భారీగా పెరిగి రూ.83,000 దాటిన పుత్తడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ!
Silver Prices : మొదటిసారిగా 3 లక్షలు దాటిన వెండి! ఇప్పుడు 1 కిలో ధర ఎంత ఉందో తెలుసుకోండి?
SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
Today Gold and Silver Prices: నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూడండి! 10 గ్రాముల పసిడి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది?
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!