By: ABP Desam | Updated at : 13 Feb 2023 02:29 PM (IST)
Edited By: Ramakrishna Paladi
వడ్డీరేట్లు
Canara Bank:
కెనరా బ్యాంకు ఓ అనూహ్య నిర్ణయం తీసుకొంది. కస్టమర్లను ఆకర్షించేందుకు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం ఆర్బీఐ వరుసగా రెపోరేట్లు పెంచుతోంది. తాజాగా 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి తరుణంలో కెనరా వడ్డీలో రాయితీ కల్పిస్తుండటం ప్రత్యేకం.
రెపో అనుసంధాన రుణాల రేటు (RLLR)ను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నామని కెనరా బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. తగ్గించిన వడ్డీరేట్లు ఫిబ్రవరి 12 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. 'రెపో లింకుడ్ లెండింగ్ రేటుకు అనుసంధానపై రిటైల్ రుణాల వడ్డీరేట్లు 12-02-202 నుంచి 9.25 శాతంగా ఉంటాయి' అని కెనరా బ్యాంకు పేర్కొంది. కాగా ఆర్బీఐ రెపోరేటును పెంచగానే ఈ బ్యాంకు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ వడ్డీ రేటును 9.4 శాతానికి సవరించడం గమనార్హం.
ప్రస్తుతం 9.25 శాతంగా ఉన్న గృహరుణాలపై వడ్డీరేటుపై 0.25 శాతం రాయితీ అందిస్తోంది. తక్కువ రిస్క్ ప్రొఫైల్ కలిగిన రుణ గ్రహీతలకు ఇది వర్తిస్తుంది. తక్కువ నష్టభయం కలిగిన, 01-01-23 నుంచి 31-03-2023 మధ్య రుణాలు మంజూరైన వారికి వర్తిస్తుంది. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌పై క్రెడిట్ రిస్క్‌ను బట్టి గృహరుణాలపై వడ్డీరాయితీ అందిస్తోంది.
ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌పై క్రెడిట్ రిస్క్ ప్రీమియం
మహిళా రుణ గ్రహీత క్రెడిట్ రిస్క్ జీరో అయితే వారికి అమలయ్యే వడ్డీరేటు 9 శాతమే. ఇతరులకు 9.05 శాతం.
మహిళా రుణ గ్రహీత క్రెడిట్ రిస్క్ 0.05 శాతం అయితే వారికి అమలయ్యే వడ్డీరేటు 9.30 శాతం. ఇతరులకు 9.35 శాతం.
మహిళా రుణ గ్రహీత క్రెడిట్ రిస్క్ 0.45 శాతం అయితే వారికి వర్తించే వడ్డీరేటు 9.70 శాతం. ఇతరులకు 9.75 శాతం.
మహిళా రుణ గ్రహీత క్రెడిట్ రిస్క్ 1.95 శాతం అయితే వారికి వర్తించే వడ్డీరేటు 11.20 శాతం. ఇతరులకు 11.25 శాతం.
కెనెరా బ్యాంకు షేరు నేడు రూ.293 వద్ద మొదలైంది. రూ.284 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. రూ.295 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు రూ.8.20 నష్టంతో రూ.285.70 వద్ద కొనసాగుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Now book flights, hotels, shop online and do much more with Canara ai1, the Banking Super App. Download now & avail the benefits of its 250+ features for a seamless banking experience.
— Canara Bank (@canarabank) February 12, 2023
Playstore: https://t.co/c6Sq57qGfw
App Store: https://t.co/1JWzxZGVoC
#ApkeSapneHamareAPPne pic.twitter.com/PHdSw2DsRO
Avail the best returns with Canara Special Deposit 400 Days scheme that gives you upto 7.75% p.a. interest rates on your investments. Visit your nearest Canara Bank branch today for more details. T&Cs apply.#CanaraBank #Deposit #BestReturns #Invest pic.twitter.com/El6GIknC0f
— Canara Bank (@canarabank) February 11, 2023
PAN Card: ఇక నుంచి QR కోడ్‌తో కొత్త పాన్ కార్డ్‌లు - "ఫ్రీ"గా తీసుకోవచ్చు
Car Insurance: కారు బీమా - వారెంటీల విషయంలో ఓనర్లకు ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవీ
Gold Rate Ttoday: రూ.1,300 తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
NTPC Green Energy IPO: ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో అలాట్మెంట్ స్టేటస్‌ను ఇంట్లో కూర్చునే ఇలా చెక్ చేయండి
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Realme GT 7 Pro: ఐఫోన్ రేట్‌తో లాంచ్ అయిన రియల్మీ జీటీ 7 ప్రో - అంత రేటు వర్తేనా?