By: Arun Kumar Veera | Updated at : 22 Mar 2024 12:59 PM (IST)
ఎల్‌ఐసీ స్పెషల్ పాలసీ జీవన్ ఉత్సవ్
LIC Jeevan Utsav Policy Details in Telugu: మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కూడా మారుతోంది. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా కొత్త తరం బీమా ఉత్పత్తులను ప్రజల వద్దకు తీసుకొస్తోంది. ఇదే కోవలో, ఇటీవల ఒక కొత్త పాలసీని ఎల్‌ఐసీ లాంచ్ చేసింది. ఆ పథకం పేరు 'జీవన్ ఉత్సవ్'. పొదుపు, జీవితాంతం బీమాతో పాటు జీవితాంతం కచ్చితమైన రాబడికి హామీ (Guaranteed returns) ఇవ్వడం ఈ ప్లాన్ ప్రత్యేకత.
ఎల్‌ఐసీ జీవన్ ఉత్సవ్ పాలసీ ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, లైఫ్‌టైమ్ ఇన్సూరెన్స్ కవరేజ్ (Lifetime Insurance Coverage) అందించే సరికొత్త ప్లాన్. ఈ పాలసీ తీసుకున్నాక, ప్రీమియం చెల్లింపు వ్యవధి పూర్తయిన తర్వాత కొంత వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. ఆ తర్వాత, హామీ మొత్తంలో 10 శాతాన్ని పాలసీదారుకు ఏటా చెల్లిస్తారు. అలా.. పాలసీహోల్డర్ జీవితాంతం ఆదాయం (Income for lifelong) వస్తూనే ఉంటుంది.
అర్హతలు
పసిపిల్లలు, యువత, వృద్ధులు, ఆడవాళ్లు, మగవాళ్లు ఎవరైనా LIC జీవన్ ఉత్సవ్ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ కొనుగోలు చేసేందుకు కనిష్ట వయోపరిమితి 90 రోజులు - గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు. ఈ పథకం కింద.. 5-16 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత కొంత వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది.
5 సంవత్సరాల ప్రీమియం టెన్యూర్‌ను ఎంచుకుంటే, తర్వాత మరో 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 6 సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే 4 సంవత్సరాల వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. 7 సంవత్సరాల పేమెంట్ ఆప్షన్ తీసుకుంటే వెయిటింగ్ పిరియడ్ మరో 3 సంవత్సరాలు అవుతుంది. 8-16 సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే ఇంకో 2 ఏళ్లు వెయిట్ చేయాలి.
వెయింటింగ్ పిరియడ్ ముగిసిన నాటి నుంచి పాలసీ మొత్తంలో ఏటా 10% చొప్పున LIC మీకు తిరిగి చెల్లిస్తుంది. అలా.. పాలసీదారు బతికి ఉన్నంత కాలం డబ్బు చెల్లిస్తుంది. ఈ పథకం కింద, పెట్టుబడిదార్లు కనీసం రూ.5 లక్షల హామీ మొత్తాన్ని (Minimum sum assured) తీసుకోవాలి. గరిష్టంగా ఎంత మొత్తాన్నైనా ఎంచుకోవచ్చు.
పాలసీ తీసుకున్న తర్వాత... నెలకు ఒకసారి, మూడు నెలలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి చొప్పున ప్రీమియం చెల్లించొచ్చు. పాలసీ చెల్లింపు కాలంలో పాలసీదారు కట్టే ప్రతి 1000 రూపాయలకు 40 రూపాయల చొప్పున గ్యారెంటీడ్ అడిషన్స్‌ను (Guaranteed additions) కూడా LIC జమ చేస్తుంది.
చక్ర వడ్డీ ప్రయోజనం
జీవన్ ఉత్సవ్ పథకం కింద జీవితాంతం ఆదాయం పొందడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. అవి.. రెగ్యులర్ ఇన్‌కమ్, ఫ్లెక్సీ ఇన్‌కమ్. ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. రెగ్యులర్ ఇన్‌కమ్ ఆప్షన్‌లో ఏటా 10% డబ్బు జీవితాంతం తిరిగి వస్తుంది. ఫ్లెక్సీ ఇన్‌కమ్ ఆప్షన్ ఎంచుకుంటే, ఏటా చెల్లించే డబ్బు ఎల్‌ఐసీ వద్దే ఉంటుంది, దానిపై 5.5 శాతం చక్రవడ్డీ వస్తుంది. కావాలంటే, జమ అయిన మొత్తంలో 75% డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తానికి చక్ర వడ్డీ లభిస్తుంది.
డెత్ బెనిఫిట్స్
పాలసీదారు మరణిస్తే.. డెత్ బెనిఫిట్స్‌తో (LIC Jeevan Utsav Death Benefit) పాటు గ్యారెంటీడ్ అడిషన్స్‌ను కలిపి ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. డెత్ ఇన్సూరెన్స్ డబ్బు లేదా వార్షిక ప్రీమియానికి 7 రెట్ల మొత్తం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని నామినీకి ఇస్తుంది.
జీవన్ ఉత్సవ్ పాలసీపై లోన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. ప్రీమియం చెల్లింపు ప్రారంభమైన తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకోవచ్చు. అప్పుపై పాలసీహోల్డర్ చెల్లించే వడ్డీ, రెగ్యులర్ ఆదాయంలో 50% మించకూడదు.
ఎల్‌ఐసీ జీవన్ ఉత్సవ్ పాలసీని ఎల్‌ఐసీ ఏజెంట్ ద్వారా కొనొచ్చు, లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు.
మరో ఆసక్తికర కథనం: పోటీపోటీగా దిగొచ్చిన పసిడి, రజతం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
UPI Payments Record: ఫోన్ తియ్, స్కాన్ చెయ్ - యూపీఐని మామూలుగా వాడడం లేదుగా!
Stock Market Crash: '1996 పీడకల' రిపీట్ అవుతుందా, 30 ఏళ్ల రికార్డ్ బద్ధలవుతుందా? - స్టాక్ మార్కెట్‌లో ఒకటే టెన్షన్
Bank Holidays In March: మార్చి నెలలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు - ఇదిగో ఫుల్ హాలిడేస్ లిస్ట్
Gold-Silver Prices Today 01 Mar: రూ.87000కు దిగొచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Gas Cylinder Price Hike: పండుగలు, పెళ్లిళ్ల టైమ్‌లో జనం నెత్తిన 'బండ' - పెరిగిన గ్యాస్ సిలిండర్ రేట్లు
ASHA Workers Good News: ఏపీలో ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త, త్వరలోనే ఉత్తర్వులు జారీ
Tillu Cube: రవితేజ... సిద్ధూ జొన్నలగడ్డ... ఎవరి సినిమా ముందు? - 'మ్యాడ్ స్క్వేర్' రిజల్ట్ డిసైడ్ చేస్తుందా?
SLBC Tunnel Recue operation: చివరి దశకు టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
GV Reddy Shocking Comments: రాజీనామా తర్వాత సీఎం చంద్రబాబుపై జీవీ రెడ్డి సంచలన పోస్ట్, సోషల్ మీడియాలో ట్రెండింగ్