By: ABP Desam | Updated at : 25 Nov 2023 03:04 PM (IST)
పాన్ కార్డ్‌లో పేరు సరిచేయడం చాలా ఈజీ
Name Change in PAN Card Online With Aadhaar Details: మన దేశంలో ఆధార్ లాగే పాన్ (Permanent Account Number - PAN) కూడా చాలా కీలకం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, క్రెడిట్ కార్డ్ తీసుకోవడం, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం, ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయడం, వ్యక్తిగత గుర్తింపు.. ఇలా పనులకు పాన్ కార్డ్ ఉండాల్సిందే.
పది ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ (అంకెలు, ఆంగ్ల అక్షరాలు కలిసినది) రూపంలో పాన్ ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లు, పాన్ అంటే పర్మినెంట్ అకౌంట్ నంబర్. ఒక వ్యక్తికి ఒక జీవితకాలంలో ఒక్క నంబర్ మాత్రమే జారీ అవుతుంది.
కొన్నిసార్లు, పాన్ మీద ఉండే పేరులో ఎక్కువ భాగం మారిపోతుంది, లేదా రాంగ్ స్పెల్లింగ్ ఉంటుంది. దీనివల్ల, ఒకే వ్యక్తికి చెందిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌లోని పేర్లు మ్యాచ్ కావు. ఫలితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే మీ పాన్ కార్డ్‌లోని పేరును సరిచేసుకోవాల్సిందే. పాన్ కార్డ్‌లో తప్పుగా ఉన్న పేరు కరెక్ట్ చేయడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి మీ ఆధార్ కార్డ్.
ఆధార్ ద్వారా పాన్ కార్డ్‌లో పేరు మార్చుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు (steps to change name in PAN card through Aadhaar):
స్టెప్ 1: https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లింక్ ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. PAN Card Servicesపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Change/Correction in PAN Cardపై క్లిక్ చేయండి.
స్టెప్ 2: PAN డేటాలో మార్పు/కరెక్షన్ కోసం అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 3: వివరాలను నమోదు చేసి, continueపై క్లిక్ చేయండి (టోకెన్ నంబర్ గుర్తు పెట్టుకోండి). అక్కడ.. ఫిజికల్ (భౌతికంగా డాక్యుమెంట్స్ పంపడం); డిజిటల్‌గా eKYC & Esign సబ్మిట్ చేయడం అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకదానిని ఎంచుకోండి.
స్టెప్ 4: ఆధార్ బేస్‌డ్ e-KYC ఆప్షన్ ఎంచుకునే బాక్స్‌ను సూచించే Yes మీద క్లిక్ చేయండి (ఇక్కడ, ఆధార్ ప్రకారం అన్ని వివరాలు అప్‌డేట్ అవుతాయి). తర్వాత Save మీద క్లిక్ చేయండి.
స్టెప్ 5: మీ పాన్‌ను నమోదు చేయండి. అప్‌డేట్ అయిన తర్వాత, ఫిజికల్ పాన్ కార్డ్ & ఈ-పాన్ రెండూ కావాలా, లేదా ఈ-పాన్ మాత్రమే కావాలా అన్న ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒక ఆప్షన్ ఎంచుకోండి.
స్టెప్ 6: మీ ఆధార్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను నమోదు చేయాలి. మీ ఆధార్ కార్డ్‌పై ఉన్న సేమ్ ఫొటోనే పాన్ కార్డ్‌పైనా ప్రింట్ చేయాలా, వద్దా అన్న ఆప్షన్లలో ఒకదానిని ఎంచుకోండి.
స్టెప్ 7: మీ ఆధార్ కార్డ్ ప్రకారం మీ పేరును నమోదు చేయండి.
స్టెప్ 8: అన్ని ప్రాథమిక వివరాలు ఫిల్ చేయండి, అవసరమైన పేమెంట్ చేయండి.
స్టెప్ 9: పేమెంట్ ప్రక్రియ విజయవంతం అయిన తర్వాత, స్క్రీన్‌పై రసీదు కనిపిస్తుంది. 'కంటిన్యూ'పై క్లిక్ చేయండి.
స్టెప్ 10: UIDAI సర్వర్ నుంచి ఆధార్ అథెంటికేషన్ జరుగుతుంది.
స్టెప్ 11: ఆధార్ అథెంటికేషన్ OTPని మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. OTPని ఎంటర్ చేసిన తర్వాత UIDAI డేటాబేస్‌లో ఉన్న మీ చిరునామా PAN ఫామ్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. దానిని ఓకే చేయడం.
స్టెప్ 12: డిటెల్స్ మరొక్కసారి కన్ఫర్మ్ చేసుకుని, submit చేయండి.
మీ ఆధార్‌లోని ఈ-సంతకాన్ని ఉపయోగించి అప్లికేషన్‌పై ఈ-సైన్ చేయడానికి మీకు మరొక OTP వస్తుంది. దానిని కూడా సంబంధిత గడిలో పూరించండి.
ఆఫ్‌లైన్ మార్గంలో పాన్‌లో పేరు సవరణ (Name correction in PAN by offline mode)
ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ పాన్‌లో కరెక్షన్స్ చేయవచ్చు. ఆఫ్‌లైన్ మోడ్ కోసం, మీరు సమీపంలోని పాన్ ఫెసిలిటేషన్ సెంటర్‌కు (Pan Facilitation Centre) వెళ్లి తగిన ఫామ్ పూరించి, అక్కేడ సబ్మిట్ చేయండి.
కొత్త పాన్ కార్డ్/పాన్ డేటాలో మార్పుల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్స్:
ప్రొటీన్ ద్వారా చేయాలంటే ఆన్‌లైన్ లింక్: https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html
UTIITSL ద్వారా చేయాలంటే ఆన్‌లైన్ లింక్: https://www.myutiitsl.com/PAN_ONLINE/CSFPANApp
PDF డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఆన్‌లైన్ లింక్: https://www.incometaxindia.gov.in/Documents/form-for-changes-in-pan.pdf
మరో ఆసక్తికర కథనం: బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తే టాక్స్ కట్టాలి, ఈ లిమిట్ దాటితే భారీ బాదుడు
Property Loan: ఆస్తి తనఖా లోన్‌లపై లేటెస్ట్ వడ్డీ రేట్లు - రుణం తీసుకునే ముందు ఇది తెలుసుకోండి
Gold-Silver Prices Today 02 April: పసిడి నగలను మరిచిపోవడం మంచిది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Women Investment: ఆడవాళ్లు ఆర్థికంలో అదరగొడుతున్నారు: AMFI-Crisil నివేదిక
PF Withdrawal: ఇదీ శుభవార్తంటే - PF ఆటో సెటిల్మెంట్ అడ్వాన్స్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు!
Gold-Silver Prices Today 01 April: రూ.95,000 చేరిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
MLAs Disqualification Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
Waqf Amendment Bill: ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
Nani: నాని సినిమాలో మరో హీరో... 'హిట్ 3'లోకి పోలీస్‌గా ఖైదీ వస్తాడా?