By: ABP Desam | Updated at : 11 Jun 2022 12:23 PM (IST)
Edited By: Ramakrishna Paladi
కరవుభత్యం
7th Pay Commission 5 percent DA hike in July Check latest update on dearness allowance : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! 2022, జులై 1 నుంచి వారి వేతనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారు మరో 5 శాతం డీఏ (Dearness allowance) పెంచేందుకు సిద్ధమవుతోందని సమాచారం. కేబినెట్ గనక ఇందుకు ఆమోదం తెలిపితే 34 శాతంగా ఉన్న కరవుభత్యం ఏకంగా 39కి పెరుగుతుంది.
Also Read: ఆడపిల్ల పుడితే రూ.1.30 లక్షలు ఇస్తున్న స్కీమ్! దరఖాస్తు ప్రాసెస్ ఇదీ!
ఏడాదికి రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం కరవుభత్యం ప్రకటిస్తుంది. జనవరి, జులై నుంచి వీటిని అమలు చేస్తుంటారు. ఈ నెల గడిస్తే జులై వస్తుంది. ద్రవ్యోల్బణం (Inflation) విపరీతంగా పెరగడంతో ఈసారి ఎక్కువ డీఏ (DA) ఇస్తారని సంకేతాలు అందుతున్నాయి. ఆల్ ఇండియా సీపీఐ (AICP Index) ఆధారంగా ఉద్యోగులకు డీఏ నిర్ణయిస్తారు. ఈ సారి ధరలు మండిపోతుండటంతో ప్రతి నెలా సూచీ పెరుగుతోంది.
2022 ఏడాదికి సంబంధించిన మొదటి డీఏను మార్చిలో ప్రకటించారు. 2021 డిసెంబర్లో ఏఐసీపీ 125.4గా ఉంది. డీఏ పెంపునకు దీనినే పరిగణనలోకి తీసుకున్నారు. ఆ తర్వాత సూచీ 0.3 పాయింట్ల పడిపోయి 125.4కు చేరుకుంది. 2022 ఏప్రిల్‌లో 1.7 శాతం పెరిగి 127.7కు చేరింది. నెల రోజుల వ్యవధిలోనే 1.35 శాతం పెరిగింది. ద్రవ్యోల్బణం సైతం 6.33 శాతానికి చేరింది. ఆహార ద్రవ్యోల్బణమైతే 7.05 శాతంగా ఉంది. అందుకే అధిక డీఏకు ఆస్కారం ఉంది.
Also Read: కొత్త కార్మిక చట్టాలు - 3 రోజుల వీకాఫ్! పెరగనున్న లీవ్స్, బేసిక్ పే, పీఎఫ్ కంట్రిబ్యూషన్!
ద్రవ్యోల్బణం, ఏఐసీపీ సూచీ పెరగడంతో డీఏ పెరగనుంది. 2022 జనవరికి సంబంధించిన డీఏను మార్చి 30న పెంచారు. 3 శాతం ప్రకటించడంతో 31గా డీఏ 34 శాతానికి చేరింది. ఈసారి ధరలు మరీ కొండెక్కడంతో ఏకంగా 5 శాతం వరకు కరవుభత్యం పెంచేందుకు ఛాన్స్ ఉంది. అదే జరిగితే 34గా ఉన్న డీఏ 39కి చేరుతుంది. అలాగే జులై నుంచి బేసిక్ సాలరీలో మార్పు చేస్తారని తెలిసింది. గతంతో పోలిస్తే ఎక్కువ మూల వేతనం వస్తుందని సమాచారం.
PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఆరేళ్లుగా అన్యాయం!, కొత్త సంవత్సరంలో తీరు మారుతుందా?
Interest Rates Impact on EMI: వడ్డీ రేట్లలో కొద్దిపాటి పెరుగుదల మీ ఈఎంఐని గణనీయంగా ఎలా పెంచుతుంది?
CTC Vs Take Home Salary: సీటీసీకి, చేతికొచ్చే జీతానికి మధ్య ఇంత తేడా ఎందుకు, పే స్లిప్లో ఎలాంటి కటింగ్స్ ఉంటాయ్?
Aadhar Virtual ID: ఆధార్ కార్డ్పై కనిపించే VID నంబర్ అర్థం ఇదా!, మీ వివరాలన్నీ ఫుల్ సేఫ్!
Gold-Silver Prices Today 30 Dec: ఒకేసారి రూ.1,600 పెరిగిన పసిడి రేటు - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
KTR: ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?