By: ABP Desam | Updated at : 13 Oct 2022 03:01 PM (IST)
Edited By: Arunmali
SIP మాత్రమే కాదు, STP కూడా ఉంది తెలుసా?
Mutual Funds - STP: సాధారణంగా, ఒక విషయం మీద నిలకడలేని వారిని, అవకాశవాదులను "గోడ మీద పిల్లులు" అంటుంటారు. ఎవరినైనా విమర్శించడానికి ఈ పదాన్ని వాడుతుంటారు. స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే, గోడ మీద పిల్లి వాటమే కరెక్ట్. ఎందుకంటే, మార్కెట్‌ను బట్టి మన నిర్ణయాలను మార్చుకుంటుండాలి. గోడకు ఎటు వైపు అవకాశం ఉంటే అటు వైపు దూకాలి.
అసలు విషయానికి వద్దాం. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే మార్గాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన పద్ధతి 'క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక' (Systematic Investment Plan - SIP). దీంతోపాటు, క్రమానుగత బదిలీ ప్రణాళిక (Systematic Transfer Plan- STP) కూడా ఉంది. దీని గురించి చాలా మందికి తెలియదు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు, 'గోడ మీద పిల్లి' వాటంతో వచ్చే ప్రయోజనాలను ఈ ప్లాన్ మనకు అందిస్తుంది.
STP ద్వారా, ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి మరో మ్యూచువల్ ఫండ్ పథకానికి పెట్టుబడులను మార్చుకోవచ్చు. ఎక్కువ లాభాలను అందించే సెక్యూరిటీల్లోకి మారిపోవచ్చు. మార్కెట్ స్వింగ్ సమయంలో నష్టపోయే పథకాల నుంచి మారిపోవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి పెట్టుబడి మొత్తాలకు రక్షణ ఉంటుంది. సాధారణంగా, డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కు నిధుల బదిలీలు జరుగుతుంటాయి. ఇక్కడొక చిన్న పరిమితి ఉంది. ఒకే సంస్థ నిర్వహించే వివిధ పథకాల మధ్య మాత్రమే బదిలీకి అవకాశం ఉంది. వేరే కంపెనీలు నిర్వహించే పథకాల్లోకి STP ద్వారా నిధులను మళ్లించలేము.
STP రకాలు
ఫ్లెక్సిబుల్ STP: అవసరమైనప్పుడు బదిలీ చేయవలసిన మొత్తాన్ని పెట్టుబడిదారులే నిర్ణయిస్తారు. మార్కెట్ అస్థిరత, పథకం పనితీరు మీద అంచనాలను బట్టి, తన ప్రస్తుత ఫండ్‌లో ఎక్కువ వాటాను బదిలీ చేయాలనుకోవచ్చు లేదా ఎక్కువ మొత్తాన్ని ప్రస్తుత ఫండ్‌లోనే ఉంచేయవచ్చు.
ఫిక్స్‌డ్ STP: ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరొకదానికి బదిలీ చేసే పెట్టుబడి మొత్తంలో మార్పు ఉండదు.
మూలధన STP: ఒక ఫండ్‌లో వచ్చిన మొత్తం లాభాలు మరింత వృద్ధికి అవకాశం ఉన్న మరో పథకంలోకి బదిలీ అవుతాయి.
పన్ను కట్టాలా?
STP కింద బదిలీ చేసిన మొత్తంపై మూలధన లాభం వస్తే పన్ను మినహాయింపు ఉంటుంది. STP మ్యూచువల్ ఫండ్స్ నుంచి మూడు సంవత్సరాల ముందే ఎగ్టిట్ అయితే వర్తించే 15 శాతం పన్ను (స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను) నుంచి కూడా మినహాయింపు పొందొచ్చు. మూడేళ్లు దాటాక ఎగ్జిట్ అయితే కట్టాల్సిన టాక్స్ (దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను) నుంచి కూడా మినహాయింపులను పొందే అవకాశం ఉన్నా, పెట్టుబడిదారుల వార్షిక ఆదాయం మీద అది ఆధారపడి ఉంటుంది.
ఎంట్రీ - ఎగ్జిట్ ఛార్జెస్
STP మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి కనీస మొత్తాన్ని సెబీ నిర్దేశించలేదు. అయితే, చాలా కంపెనీలు కనీస పెట్టుబడిని రూ.12,000 గా నిర్ణయించాయి. పెట్టుబడిదారుడు కనీసం ఆరు ఫండ్ బదిలీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటి మీద ఎంట్రీ లోడ్ ఉండదు గానీ, ఎగ్జిట్ ఛార్జ్ ఉంటుంది. పెట్టుబడులు బదిలీ చేసే సమయంలో గరిష్టంగా 2% మొత్తాన్ని ఎగ్జిట్ ఫీజుగా వసూలు చేస్తారు. లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కి నిధులను బదిలీ చేస్తే ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ ఉండవు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
Teeth Enamel: దంతాల ఎనామిల్ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం