By: ABP Desam | Updated at : 23 Sep 2022 11:55 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Twitter )
Stock Market @ 12 PM 23 September 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపు, రూపాయి పతనంతో బెంచ్‌మార్క్ సూచీలు పతనం అవుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మదుపర్లలో నెగెటివ్ సెంటిమెంటు పెంచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 187 పాయింట్ల నష్టంతో 17,442 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 646 పాయింట్ల నష్టంతో 58,4729 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 59,119 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,005 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 58,378 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,451437 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 646 పాయింట్ల నష్టంతో 58,472 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 17,442 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,593 వద్ద ఓపెనైంది. 17,413 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,642 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 187 పాయింట్ల నష్టంతో 17,442 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ నష్టాల్లో ఉంది. ఉదయం 40,429 వద్ద మొదలైంది. 39,662 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,528 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 886 పాయింట్ల నష్టంతో 39,743 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 37 నష్టాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫీ, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, ఎంఅండ్‌ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Vizag Modi Speech : చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా