By: ABP Desam | Updated at : 06 Oct 2022 04:01 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్,
Stock Market Closing 06 September 2022: భారత స్టాక్ మార్కెట్లు గురువారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం ఉదయం సూచీలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఆఖర్లో మదుపర్లు లాభాలు స్వీకరించడంతో కాస్త తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 57 పాయింట్ల లాభంతో 17,331 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 156 పాయింట్ల లాభంతో 58,222 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 37 పైసలు తగ్గి 81.89 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,065 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,314 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 58,173 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,578 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 156 పాయింట్ల లాభంతో 58,222 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 17,274 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,379 వద్ద ఓపెనైంది. 17,315 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,428 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 57 పాయింట్ల లాభంతో 17,331 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 39,343 వద్ద మొదలైంది. 39,232 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,608 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 172 పాయింట్ల లాభంతో 39,282 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ముగిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యునీలివర్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ సూచీలు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?