By: ABP Desam | Updated at : 12 Oct 2022 11:22 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్,
Stock Market Opening 12 October 2022: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. బెంచ్ మార్క్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 7 పాయింట్ల లాభంతో 16,991 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 43 పాయింట్ల లాభంతో 57,190 వద్ద ఉన్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 57,147 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,312 వద్ద లాభాల్లో మొదలైంది. 57,085 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,458 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 43 పాయింట్ల లాభంతో 57,190 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 16,983 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,025 వద్ద ఓపెనైంది. 16,960 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,071 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 7 పాయింట్ల లాభంతో 16,991 వద్ద ట్రేడవుతుంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 38,784 వద్ద మొదలైంది. 38,606 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,935 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 42 పాయింట్ల లాభంతో 38,755 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్, ఎల్‌టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, కన్జూమర్ డ్యురబుల్స్, హెల్త్‌కేర్, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి