By: ABP Desam | Updated at : 06 Jul 2022 12:30 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Getty )
Stock Market @ 12 PM 6 July 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) బుధవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఆ తర్వాత కాస్త తగ్గి రేంజ్‌బౌండ్‌లో కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 71 పాయింట్ల లాభంతో 15,927, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 240 పాయింట్ల లాభంతో 53,373 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 53,134 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,170 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. 53,143 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,584 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 240 పాయింట్ల లాభంతో 53,373 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 15,798 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 15,818 వద్ద ఓపెనైంది. 15,800 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,927 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 71 పాయింట్ల లాభంతో 15,927 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 33,929 వద్ద మొదలైంది. 33,876 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,254 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 367 పాయింట్ల లాభంతో 34,183 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, హిందుస్థాన్ యునీలివర్, ఐచర్ మోటార్స్, ఏసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, హిందాల్కో, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, మీడియా రంగాల సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి.
Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్ చేతిలో ఉంటే చాలు, టాప్ క్లాస్ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి
Monthly Income: మ్యూచువల్ ఫండ్ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్
Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది
Mutual Fund SIPs: 'సిప్' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు
Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్ వచ్చాయి, సిప్ చేసిన మ్యాజిక్ ఇది
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
/body>