Stock Market Opening 13 October 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ తీవ్రతను పెంచడం ఆందోళన కలిగిస్తోంది. ద్రవ్యోల్బణం పెరుగుదల, జీడీపీ వృద్ధిరేటు తగ్గుదల వంటివి మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటును పెంచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 95 పాయింట్ల నష్టంతో 17,028 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 313 పాయింట్ల నష్టంతో 57,309 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 57,625 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,512 వద్ద నష్టాల్లో మొదలైంది. 57,200 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,568 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 313 పాయింట్ల నష్టంతో 57,309 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 17,123 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,087 వద్ద ఓపెనైంది. 16,996 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,112 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 95 పాయింట్ల నష్టంతో 17,028 వద్ద చలిస్తోంది.


Also Read: 5జీ పేరిట ఫిషింగ్‌ - తొందరడ్డారో, గేలానికి చిక్కినట్లే!


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 38,957 వద్ద మొదలైంది. 38,646 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,061 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 433 పాయింట్ల నష్టంతో 38,684 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, హిందాల్కో, సన్ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. విప్రో, ఎస్‌బీఐ లైఫ్, ఎల్‌టీ, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ రంగాల సూచీలు ఒక శాతానికి పైగా పతనమయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.