By: ABP Desam | Updated at : 22 Jul 2022 10:34 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixels )
Stock Market Opening Bell 22 July 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ఓపెనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే వచ్చినప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 30 పాయింట్ల లాభంతో 16,635 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 100 పాయింట్ల లాభంతో 55,785 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 55,681 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,800 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 55,724 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 56,006 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటల సమయంలో 100 పాయింట్ల లాభంతో 55,785 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 16,605 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,661 వద్ద ఓపెనైంది. 16,623 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,704 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 30 పాయింట్ల లాభంతో 16,635 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 36,322 వద్ద మొదలైంది. 36,286 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,534 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 279 పాయింట్ల లాభంతో 36,480 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ఉన్నాయి. యూపీఎల్, ఐచర్ మోటార్స్, టైటాన్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫీ, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఆటో, మీడియా, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ రంగాల సూచీలు ఎగిశాయి. మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స