By: ABP Desam | Updated at : 12 May 2022 04:45 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) వరుసగా ఐదో సెషన్లో భారీ నష్టపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాలు, ఎకానమీ స్లోడౌన్, ఇన్‌ప్లేషన్ డేటా రావడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం ఇందుకు కారణం. ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15,808 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1158 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.5.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
BSE Sensex
క్రితం సెషన్లో 54,088 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,608 వద్ద నష్టాల్లో మొదలైంది. 53,632 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఉదయం నుంచే అమ్మకాలు పెరగడంతో 52,702 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1158 పాయింట్ల నష్టంతో 52,930 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 16,167 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,021 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే పతనమైంది. 16,041 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అమ్మకాల సెగతో 15,735 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 359 పాయింట్ల నష్టంతో 15,808 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ముగిసింది. ఉదయం 34,289 వద్ద మొదలైంది. 33,297 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,341 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1161 పాయింట్ల నష్టంతో 33,532 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 45 నష్టాల్లో ఉన్నాయి. విప్రో, ఐచర్ మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. అదానీపోర్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటో, బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియాల్టీ సూచీలు 1-4 శాతం వరకు పతనం అయ్యాయి.
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Top Gainer May 22, 2022 : స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
Top Loser Today May 22, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
Stock Market Weekly Review: గతవారం నష్టంతో పోలిస్తే రూ.10 లక్షల కోట్లు మిగిలినట్టే!
Stock Market News: హ్యాపీ వీకెండ్! రూ.7.5 లక్షల కోట్ల లాభం! సెన్సెక్స్ 1534, నిఫ్టీ 471 +
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి