search
×

Stock Market Closing: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు! 60K పైనే సెన్సెక్స్‌, 18Kకు స్వల్ప దూరంలో నిఫ్టీ

Stock Market Closing Bell 18 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు నష్టపోయి 79.69 వద్ద ముగిసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 18 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 12 పాయింట్ల లాభంతో 17,956 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 37 పాయింట్ల లాభంతో 60,298 వద్ద ముగిశాయి. ఐటీ, హెల్త్‌కేర్‌, మెటల్‌ రంగాల్లో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు నష్టపోయి 79.69 వద్ద ముగిసింది.

BSE Sensex

క్రితం సెషన్లో 60,260 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,080 వద్ద మొదలైంది. 59,946 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,341 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 37 పాయింట్ల లాభంతో 60,298 వద్ద ముగిసింది.

NSE Nifty

బుధవారం 17,944 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,898 వద్ద ఓపెనైంది. 17,852 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,968 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 12 పాయింట్ల లాభంతో 17,956 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 39,324 వద్ద మొదలైంది. 39,291 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,703 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 194 పాయింట్ల లాభంతో 39,656 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. కొటక్‌ బ్యాంక్‌, ఎల్‌టీ, టాటా కన్జూమర్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఇండస్‌ఇండ్‌ షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్‌, యూపీఎల్‌, విప్రో, బీపీసీఎల్‌, ఇన్ఫీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, హెల్త్‌కేర్‌, మీడియా, ఐటీ, ఆటో సూచీలు పనతమయ్యాయి.

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 18 Aug 2022 03:51 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

టాప్ స్టోరీస్

Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌

Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌

NTR Nagar: జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!

NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!

Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్

Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్

Sankranti Buses : ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే

Sankranti Buses : ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే