search
×

Stock Market News: భయం భయంగానే కొనుగోళ్లు! ఆఖర్లో పుంజుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లో నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,167 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 276 పాయింట్లు నష్టపోయింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) వరుసగా నాలుగో సెషన్లో నష్టపోయాయి. ఈ వారం సీపీఐ, ఐఐపీ డేటా వస్తుండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.  అంతర్జాతీయంగా మార్కెట్లలో అస్థిరత్వం చోటు చేసుకోవడం, ద్రవ్యోల్బణం భయాలు, ఎకానమీ మందగమనంలో ఉండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,167 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 276 పాయింట్లు నష్టపోయింది.   

BSE Sensex

క్రితం సెషన్లో 54,364 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,544 వద్ద లాభాల్లో మొదలైంది. 54,598 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా అమ్మకాలు పెరగడంతో  53,519 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో కాస్త తేరుకొని 276 పాయింట్ల నష్టంతో 54,088 వద్ద ముగిసింది.

NSE Nifty

మంగళవారం 16,240 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,318 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి నష్టాల్లోనే కదలాడింది. 16,318 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అమ్మకాల సెగతో 15,992 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఐరోపా మార్కెట్లు తెరుచుకున్నాక కాస్త కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో 72 పాయింట్ల నష్టంతో 16,167 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ట్రేడై లాభాల్లోకి వచ్చింది. ఉదయం 34,686 వద్ద మొదలైంది. 34,143 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,793 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 210 పాయింట్ల లాభంతో 34,693 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభపడగా 28 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. శ్రీసెమ్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఎల్‌టీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్‌ నష్టపోయాయి. బ్యాంకు, రియాల్టీ సూచీలు 0.05 శాతం వరకు లాభపడ్డాయి. ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, పవర్‌, క్యాపిటల్స్‌ గూడ్స్‌ సూచీలు ఎరుపెక్కాయి. 

Published at : 11 May 2022 03:48 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

టాప్ స్టోరీస్

iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి

iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి

Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!

Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!

Top 10 Actress: టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?

Top 10 Actress: టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?

Mustafizur Rahman Joins PSL: ఐపీఎల్ నుండి తొలగింపు.. PSLలో ఆడాలని ముస్తాఫిజుర్ రెహ్మాన్ నిర్ణయం.. 3 రోజుల్లో మారిన సీన్

Mustafizur Rahman Joins PSL: ఐపీఎల్ నుండి తొలగింపు.. PSLలో ఆడాలని ముస్తాఫిజుర్ రెహ్మాన్ నిర్ణయం.. 3 రోజుల్లో మారిన సీన్