By: ABP Desam | Updated at : 25 Aug 2022 10:45 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening Bell 25 August 2022: భారత స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందాయి. ఆసియా మార్కెట్లో లాభాల్లో ఓపెనవ్వడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 81 పాయింట్ల లాభంతో 17,686 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 293 పాయింట్ల లాభంతో 59,378 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 59,085 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,315 వద్ద మొదలైంది. 59,290 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,469 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 293 పాయింట్ల లాభంతో 59,378 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 17,604 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,679 వద్ద ఓపెనైంది. 17,659 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,716 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 81 పాయింట్ల లాభంతో 17,686 వద్ద చలిస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 39,190 వద్ద మొదలైంది. 39,163 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,190 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 294 పాయింట్ల లాభంతో 39,332 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ లైఫ్, యూపీఎల్, దివిస్ ల్యాబ్, హిందుస్థాన్ యునీలివర్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిప్లా, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్షియల్స్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి
Samyuktha Menon : సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!