By: Rama Krishna Paladi | Updated at : 13 Sep 2023 01:31 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Twitter )
Stock Market at 12PM, 13 September 2023:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. నిఫ్టీ ఇంట్రాడేలో సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 59 పాయింట్లు పెరిగి 20,052 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 185 పాయింట్లు పెరిగి 67,406 వద్ద కొనసాగుతున్నాయి. ఆయిల్, మెటల్ రంగాలు బలపడ్డాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 67,221 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 67,188 వద్ద మొదలైంది. 67,053 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,443 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 185 పాయింట్ల లాభంతో 67,406 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,993 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,989 వద్ద ఓపెనైంది. 19,944 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,063 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 59 పాయింట్లు పెరిగి 20,052 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. ఉదయం 45,449 వద్ద మొదలైంది. 45,299 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,751 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 196 పాయింట్ల లాభంతో 45,707 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. గ్రాసిమ్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, బీపీసీఎల్, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హీరో మోటో, దివిస్ ల్యాబ్ నష్టపోయాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.340 తగ్గి రూ.59,450 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.73,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.230 పెరిగి రూ.24,060 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు జీవిత కాల గరిష్ఠాలకు చేరుకోవడంతో మదుపర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడ్డారు. చివరికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 3 పాయింట్లు తగ్గి 19,993 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 94 పాయింట్లు తగ్గి 67,221 వద్ద ముగిశాయి. ఐటీ షేర్లు జోరుమీదున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy