By: ABP Desam | Updated at : 09 Oct 2023 01:07 PM (IST)
షేర్ మార్కెట్ ( Image Source : Pexels )
Stock Market at 12 PM, 09 October 2023:
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు ఒక్కరోజే ఐదు శాతం మేర పెరిగాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. దేశీయ మార్కెట్లు ఈ వారమంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 142 పాయింట్లు తగ్గి 19,511 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 427 పాయింట్లు తగ్గి 65,526 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,995 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,560 వద్ద మొదలైంది. 65,434 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,789 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 427 పాయింట్లు తగ్గి 65,526 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,653 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,539 వద్ద ఓపెనైంది. 19,480 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,588 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 142 పాయింట్లు తగ్గి 19,511 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ తగ్గింది. ఉదయం 44,057 వద్ద మొదలైంది. 43,796 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,113 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 510 పాయింట్ల నష్టంతో 43,850 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 8 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యునీలివర్ లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, హీరోమోటో, బీపీసీఎల్, ఎం అండ్ ఎం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ నష్టపోయాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.58,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.72,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.190 తగ్గి రూ.23,620 వద్ద కొనసాగుతోంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండో సెషన్లో అదరగొట్టాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుతుండటం మార్కెట్ వర్గాల్లో పాజిటివ్ సెంటిమెంటుకు కారణమైంది. ఇక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీరేట్ల యథాతథంగా ఉంచింది. ఊహించిందే జరగడంతో మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లు చేపట్టారు. ఆసియాలో జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, కొరియా, చైనా సూచీలు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 107, బీఎస్‌ఈ సెన్సెక్స్ 364 పాయింట్ల మేర పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.25 వద్ద స్థిరపడింది.
క్రితం సెషన్లో 65,631 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,867 వద్ద మొదలైంది. 65,762 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,095 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 364 పాయింట్లు పెరిగి 65,995 వద్ద ముగిసింది. గురువారం 19,545 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,621 వద్ద ఓపెనైంది. 19,589 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,675 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 107 పాయింట్లు పెరిగి 19,653 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 147 పాయింట్ల లాభంతో 44,360 వద్ద ముగిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్‌ని డైట్లో చేర్చుకోవాలట