By: ABP Desam | Updated at : 27 Feb 2023 10:38 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 27 February 2023:
స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. సోమవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. మదుపర్లను మళ్లీ ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 140 పాయింట్లు తగ్గి 17,325 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 432 పాయింట్ల తగ్గి 59,030 వద్ద కొనసాగుతున్నాయి. సూచీలు బడ్జెట్ నాటి కనిష్ఠాలకు చేరుకున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 9,463 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,331 వద్ద మొదలైంది. 58,937 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,441 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 432 పాయింట్ల నష్టంతో 59,030 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 17,465 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,428 వద్ద ఓపెనైంది. 17,300 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,451 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 140 పాయింట్లు తగ్గి 17,325 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప నష్టాల్లో ఉంది. ఉదయం 39,820 వద్ద మొదలైంది. 39,745 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,135 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 12 పాయింట్లు పతనమై 39,896 వద్ద నడుస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభాల్లో 40 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, కొటక్ బ్యాంక్, బీపీసీఎల్, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఆటో, యూపీఎల్, ఇన్ఫీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి. రియాల్టీ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.56,020గా ఉంది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.24,170 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Do not fall for schemes or messages that claim to give you assured/guaranteed returns in stock market! Please report at Feedbk_invg@nse.co.in or call us at 1800 266 0050 whenever you come across such messages.#NSE #AssuredReturns @Ashish Chauhan @priya subbaraman pic.twitter.com/tWu20B2TvN
— NSE India (@NSEIndia) February 27, 2023
In this segment of #LetsTalkFinance, let's understand what Green Bonds are!#InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #StockMarketIndia #StockMarket #Investor #Investment #GreenBonds @ashishchauhan pic.twitter.com/Y3QRqO2yTS
— NSE India (@NSEIndia) February 26, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స