Stock Market Opening 26 July 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. పెద్ద కంపెనీల క్యూ1 ఫలితాలు మెరుగ్గా ఉండటం మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంటు నింపింది. ఉదయం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 121 పాయింట్లు పెరిగి 19,801 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 470 పాయింట్లు ఎగిసి 66,826 వద్ద కొనసాగుతున్నాయి. ఎల్‌టీ, టాటా మోటార్స్ షేర్లు బాగా పెరిగాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,355 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,434 వద్ద మొదలైంది. 66,431 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,897 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 470 పాయింట్ల లాభంతో 66,826 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,680 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,733 వద్ద ఓపెనైంది. 19,716 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,825 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 121 పాయింట్లు పెరిగి 19,801 వద్ద చలిస్తోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 45,935 వద్ద మొదలైంది. 45,804 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,995 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 63 పాయింట్లు పెరిగి 45,908 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. ఎల్‌టీ, రిలయన్స్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్, ఏసియన్ పెయింట్స్, దివిస్ ల్యాబ్, సిప్లా, అపోలో హాస్పిటల్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఎక్కువ పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.400 పెరిగి రూ.77,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.190 పెరిగి రూ.25,460 వద్ద కొనసాగుతోంది.
Also Read: రిటర్న్ ఫైల్ చేసినా రూపాయి కూడా టాక్స్ కట్టలేదు, 70% మంది వాళ్లే!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial