Stock Market Closing 25 July 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ సమీక్ష, క్యూ1 ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. కొనుగోళ్లకు మొగ్గు చూపలేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 8 పాయింట్లు పెరిగి 19,680 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 29 పాయింట్లు పతనమై 66,355 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 81.87 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,384 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,531 వద్ద మొదలైంది. 66,177 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,559 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 29 పాయింట్ల నష్టంతో 66,355 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,672 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,729 వద్ద ఓపెనైంది. 19,615 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,729 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 8 పాయింట్లు పెరిగి 19,680 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 46,154 వద్ద మొదలైంది. 45,622 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,156 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 78 పాయింట్లు తగ్గి 45,845 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సెమ్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఏసియన్ పెయింట్స్, ఐటీసీ, ఎల్‌టీ, బ్రిటానియా, కొటక్ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, మీడియా, మెటల్, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.60,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.77,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.70 తగ్గి రూ.25,270 వద్ద ఉంది.
Also Read: కొత్తిమీర కట్ట రూ.50, టమాట కిలో రూ.200 - ముంబయిలో రికార్డులు!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial