search
×

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో కల్లోలం - గంటలో రూ.2.5 లక్షల కోట్లు లాస్‌!

Stock Market Opening 25 January 2023: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. మదుపర్లు అన్ని రంగాల షేర్లనూ తెగనమ్ముతున్నారు.

FOLLOW US: 
Share:

Stock Market Opening 25 January 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. మదుపర్లు అన్ని రంగాల షేర్లనూ తెగనమ్ముతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 182 పాయింట్ల నష్టంతో 17,935 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 575 పాయింట్ల నష్టంతో 60,403 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు సూచీలు భారీగా నష్టపోయాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 60,978 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,834 వద్ద మొదలైంది. 60,308 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,899 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 575 పాయింట్ల నష్టంతో 60,403 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 18,188 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,093 వద్ద ఓపెనైంది. 17,909 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,100 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 182 పాయింట్ల నష్టంతో 17,935 వద్ద చలిస్తోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 42,703 వద్ద మొదలైంది. 41,909 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,733 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 755 పాయింట్లు తగ్గి 41,977 వద్ద ట్రేడవుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 45 నష్టాల్లో ఉన్నాయి. మారుతీ, హిందాల్కో, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

టాటా మోటార్స్ (Tata Motors): 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఈ వాహన తయారీ సంస్థ చాలా బలంగా బౌన్స్‌ అయింది, రూ. 285 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోని రూ. 1,516 కోట్ల నష్టం, త్రైమాసికం క్రితం రూ. 945 కోట్ల నష్టం నుంచి కోలుకుని లాభాలు ఆర్జించింది. ఏకీకృత అమ్మకాలు సంవత్సరానికి (YoY) 14%, సీక్వెన్షియల్‌గా 3% పెరిగి రూ. 82,738 కోట్లకు చేరుకున్నాయి.

బజాజ్ ఆటో (Bajaj Auto): 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 2-వీలర్ & 3-వీలర్ విభాగాల్లో వాల్యూమ్స్‌ తగ్గుదల, ప్రమోషన్లపై పెరిగిన వ్యయం సీక్వెన్షియల్‌గా దెబ్బ తీసే అవకాశం ఉంది. ఆదాయం సంవత్సరానికి 2%, సీక్వెన్షియల్‌గా 13% తగ్గి రూ. 8,852 కోట్లకు చేరుకోవచ్చన్నది మార్కెట్ అంచనా. నికర లాభం సంవత్సరానికి 11.3% పెరిగి రూ. 1,351 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది, కానీ సీక్వెన్షియల్‌గా 12% తగ్గొచ్చు. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 25 Jan 2023 11:29 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

టాప్ స్టోరీస్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?

Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం

Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం

Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు

Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు

HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన