By: ABP Desam | Updated at : 24 May 2023 10:53 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
Stock Market Opening 24 May 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17 పాయింట్లు పెరిగి 18,365 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 40 పాయింట్లు పెరిగి 62,021 వద్ద కొనసాగుతున్నాయి. అదానీ, మహీంద్రా సీఐఈ షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,981 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,832 వద్ద మొదలైంది. 61,730 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,090 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 40 పాయింట్ల లాభంతో 62,021 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 18,348 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,294 వద్ద ఓపెనైంది. 18,269 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,378 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 17 పాయింట్లు పెరిగి 18,365 వద్ద నడుస్తోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,751 వద్ద మొదలైంది. 43,707 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,946 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 54 పాయింట్లు తగ్గి 43,899 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, మారుతీ, బ్రిటానియా, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, దివిస్ ల్యాబ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్, ప్రైవేటు బ్యాంక్ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.260 పెరిగి రూ.61,360గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.75,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.490 తగ్గి రూ.27,960 వద్ద కొనసాగుతోంది.
Also Read: బెజోస్ తన ప్రియురాలికి ప్రజెంట్ చేసిన పడవ ఎంత స్పెషలో తెలుసా?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In this segment of #LetsTalkFinance, let's understand what Blue Chip Stock is!#InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #StockMarketIndia #StockMarket #Investor #Investment #BlueChipStocks pic.twitter.com/UdG1ZfUnBE
— NSE India (@NSEIndia) May 24, 2023
Attention Investors! Always make sure that your stockbroker settles the funds within 1 working day of settlement.
— NSE India (@NSEIndia) May 23, 2023
#NSEIndia #SochKarSamajhKarInvestKar #InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #InvestorProtection #brokersarenotbankers @ashishchauhan pic.twitter.com/jMgxsrkYX5
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Woman Life Rs. 5 Lakh: మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు