Stock Market Opening 24 July 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం నెగెటివ్ నోట్‌లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ సమీక్ష, క్యూ1 ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 18 పాయింట్లు తగ్గి 19,726 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 72 పాయింట్లు పతనమై 66,611 వద్ద కొనసాగుతున్నాయి. రియాల్టీ షేర్లకు గిరాకీ పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,584 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,629 వద్ద మొదలైంది. 66,532 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,748 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 72 పాయింట్ల నష్టంతో 66,611 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,745 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,748 వద్ద ఓపెనైంది. 19,704 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,762 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 18 పాయింట్లు పతనమై 19,726 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 46,131 వద్ద మొదలైంది. 45,979 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,148 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 44 పాయింట్లు తగ్గి 46,031 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్ ఎం, గ్రాసిమ్, ఎల్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. కొటక్ బ్యాంక్, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.78,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.25,340 వద్ద ఉంది.
Also Read: 5 రోజులు.. 5 ఐపీవోలు! ఈ వారం పండగే!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial