Upcoming IPOs:


భారత్‌లో ఐపీవో బూమ్‌ (IPO Boom) కొనసాగుతోంది. చిన్న, మధ్య తరహా కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో వరుసగా నమోదు అవుతున్నాయి. భారీ ప్రీమియంతో లిస్ట్‌ అవుతున్నాయి. ఈ వారమూ ఐదు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు (Public Issue) వస్తున్నాయి. యథార్థ్‌ హాస్పిటల్స్ అండ్‌ ట్రామాకేర్‌ సర్వీసెస్‌ పెద్దది కాగా మిగిలినవి చిన్నవి!


యథార్థ్‌ హాస్పిటల్స్‌ అండ్‌ ట్రామా కేర్‌ సర్వీసెస్‌ (Yatharth Hospital Khazanchi Jewellers) : ఈ కంపెనీ ఐపీవో జులై 26న మొదలై 28న ముగుస్తుంది. ప్రెష్‌ సేల్‌ కింద రూ.490 కోట్లు సేకరిస్తున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 65,51,690 షేర్లు విక్రయిస్తున్నారు. ధరల శ్రేణిని రూ.285-300గా నిర్ణయించారు. అప్పులు తీర్చేందుకు, క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ ఖర్చులు, విలీనం ఇతర వ్యూహాత్మక కార్యక్రమాల కోసం ఈ నిధులు ఉపయోగిస్తారు. ఇష్యూలో సగం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు, 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు.


ఇన్నోవేటస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌ (Innovatus Entertainment Networks) : ఈ కంపెనీ ఐపీవో జులై 25న మొదలై 27న ముగుస్తుంది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.50గా ధర నిర్ణయించారు. మొత్తం ఇష్యూ విలువ రూ.7.74 కోట్లు. ఇది కేవలం బీఎస్‌ఈలో మాత్రమే లిస్టవుతోంది. ఇన్వెంచర్‌ మర్చంట్‌ బ్యాంకర్స్‌ సర్వీసెస్‌ ఇష్యూకు లీడ్‌ మేనేజర్‌గా ఉంది. పూర్వాషా రిజిస్ట్రీ రిజిస్ట్రార్‌గా ఉన్నారు.


కజాంజి జువెలర్స్‌ (Khazanchi Jewellers): ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ జులై 24న మొదలై 28న ముగుస్తుంది. ఐపీవో విలువ రూ.92 కోట్లు. ఒక్కో లాట్‌లో 1000 ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఒక్కో షేరుకు రూ.140 ధరగా నిర్ణయించారు. షేర్లు కేవలం బీఎస్‌ఈలో మాత్రమే లిస్టవుతాయి. మార్క్‌ కార్పొరేట్‌ అడ్వైజర్స్‌ లీడ్‌ మేనేజర్‌, కేమియో కార్పొరేట్‌ సర్వీసెస్‌ రిజిస్ట్రార్‌గా ఉన్నారు.


శ్రీ టెక్‌టెక్స్‌ (Shri Techtex): ఈ కంపెనీ జులై 26న మొదలై 28న ముగుస్తుంది. షేర్ల ధరల శ్రేణి రూ.54-61గా నిర్ణయించారు. ఈ కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్ట్‌ అవుతాయి. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.37 కోట్లు సమీకరిస్తున్నారు. ఫ్యాక్టరీ షెడ్డు, సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు, యంత్రాల కొనుగోలు, నిర్వహణ ఖర్చుల కోసం ఈ డబ్బుల్ని వినియోగిస్తారు. బీ లైన్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ లీడ్‌ మేనేజర్‌, లింక్‌ ఇన్‌టైమ్‌ ఇండియా రిజిస్ట్రార్లుగా ఉన్నారు.


యాసన్స్‌ కెమెక్స్‌ కేర్‌ (Yasons Chemex Care): డైస్‌ తయారీ కంపెనీ యాసన్స్‌ కెమెక్స్‌ కేర్‌ ఐపీవో జులై 24న మొదలై 26న ముగుస్తుంది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.40 ధరగా నిర్ణయించారు. ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఎమర్జ్‌లో షేర్లు లిస్టవుతాయి. ఈ ఐపీవో ద్వారా రూ.20.57 కోట్లు సేకరిస్తున్నారు. ఈ డబ్బును వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం వాడుకుంటారు. ఫెడెక్స్‌ సెక్యూరిటీస్‌ లీడ్‌ మేనేజర్‌, కేఫిన్‌ టెక్నాలజీస్‌ రిజిస్ట్రార్‌గా ఉన్నారు.


Also Read: మీ డబ్బును పెంచే ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌, ఆగస్టు 15 వరకే అవకాశం


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial