By: ABP Desam | Updated at : 20 Feb 2023 10:55 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Getty )
Stock Market Opening 20 February 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అదానీ షేర్లు మళ్లీ యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి. ఒడుదొడుకులు ఉన్నప్పటికీ సూచీలు రోజువారీ గరిష్ఠాల్లోనే కదలాడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 25 పాయింట్లు పెరిగి 17,969 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 166 పాయింట్ల లాభంతో 61,168 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,002 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,112 వద్ద మొదలైంది. 60,957 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,290 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 166 పాయింట్ల లాభంతో 61,168 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 17,944 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,965 వద్ద ఓపెనైంది. 17,902 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,004 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 25 పాయింట్లు పెరిగి 17,969 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 41,221 వద్ద మొదలైంది. 41,084 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,292 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 60 పాయింట్లు పెరిగి 41,192 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టపోయాయి. టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, ఇన్ఫీ షేర్లు లాభపడ్డాయి. సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి. మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఫైనాన్స్, ఐటీ, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు కళకళలాడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్తబ్దుగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,950గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.68,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.24,390 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Do not fall for schemes or messages that claim to give you assured/guaranteed returns in stock market! Please report at Feedbk_invg@nse.co.in or call us at 1800 266 0050 if you come across such messages.#NSE #AssuredReturns #InvestorAwareness @ashishchauhan @psubbaraman pic.twitter.com/Gpu51OpgVk
— NSE India (@NSEIndia) February 20, 2023
Can you spot four banks that are part of the Nifty50 index? Tell us your answers in the comments below!#NSECrossword #Crossword #ShareMarket #StockMarket #NIFTY50 #Investor pic.twitter.com/vg0EL6YecS
— NSE India (@NSEIndia) February 19, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్ చేతికి మరో అస్త్రం