Stock Market Opening 18 July 2023:


స్టాక్‌ మార్కెట్లు మంగళవారం రైజింగ్‌లో ఉన్నాయి. ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపడితే సెన్సెక్స్‌ 67వేల మైలురాయి దాటడం గ్యారంటీ! నేటి ఉదయం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 78 పాయింట్లు పెరిగి 19,790 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 298 పాయింట్లు పెరిగి 66,888 వద్ద కొనసాగుతున్నాయి. విలువైన లోహాల ధరలు పెరిగాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 66,589 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,828 వద్ద మొదలైంది. 66,696 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,985 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 298 పాయింట్ల లాభంతో 66,888 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 19,711 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,787 వద్ద ఓపెనైంది. 19,738 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,811 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 78 పాయింట్లు పెరిగి 19,790 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 45,757 వద్ద మొదలైంది. 45,580 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,905 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 287 పాయింట్లు పెరిగి 45,737 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసిమ్‌, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మెటల్‌, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు పెరిగాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.120 పెరిగి రూ.60,100 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.78,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.25,920 వద్ద ఉంది.


Also Read: పతంజలి ఫుడ్స్‌పై కన్నేసిన 'అదానీ ఇన్వెస్టర్‌'! టార్గెట్‌ పెంచేశారుగా!!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial