Stock Market Closing 17 July 2023:


స్టాక్‌ మార్కెట్లు సోమవారం అదరగొట్టాయి. రికార్డు స్థాయిలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 146 పాయింట్లు పెరిగి 19,711 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 529 పాయింట్లు పెరిగి 66,589 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి 82.04 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 66,060 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,148 వద్ద మొదలైంది. 66,015 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,656 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 529 పాయింట్ల లాభంతో 66,589 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 19,564 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,612 వద్ద ఓపెనైంది. 19,562 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,731 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 146 పాయింట్లు పెరిగి 19,711 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,951 వద్ద మొదలైంది. 44,695 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,556 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 630 పాయింట్లు పెరిగి 45,449 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. ఎస్బీఐ, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. ఓఎన్జీసీ, హీరోమోటో కార్ప్‌, టాటా మోటార్స్‌, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, రియాల్టీ మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్‌ సూచీలు అదరగొట్టాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేం లేవు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,000గా ఉంది. కిలో వెండి రూ.77,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.25,480 వద్ద ఉంది.


Also Read: ఎక్కువ వడ్డీ చెల్లించే గవర్నమెంట్‌ పాపులర్‌ స్కీమ్‌ - ఇకపై 3 బ్యాంకుల్లో!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial