By: Rama Krishna Paladi | Updated at : 18 Aug 2023 11:06 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 18 August 2023:
స్టాక్ మార్కెట్ల వరుస పతనం కొనసాగుతోంది. శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగెటివ్ సిగ్నల్స్ వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 97 పాయింట్లు తగ్గి 19,267 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 348 పాయింట్లు తగ్గి 64,802 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్ యీల్డుల పెరుగుదలతో ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,151 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,025 వద్ద మొదలైంది. 64,786 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,042 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 348 పాయింట్ల నష్టంతో 64,802 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 19,365 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,301 వద్ద ఓపెనైంది. 19,253 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,329 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 97 పాయింట్లు నష్టపోయి 19,267 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 43,724 వద్ద మొదలైంది. 43,957 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,672 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 22 పాయింట్లు పెరిగి 43,913 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఎల్‌టీ షేర్లు లాభపడ్డాయి. విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఆటో, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల రూ.59,020 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.73500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.270 పెరిగి రూ.23,970 వద్ద ఉంది.
Also Read: మిస్సైళ్లను మరిపించిన మల్టీబ్యాగర్ డిఫెన్స్ షేర్లు, 3 రోజుల్లోనే 40% అప్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?