search
×

Stock Market News: అనిశ్చితితో ఆగమాగం! నష్టాల్లోనే సెన్సెక్స్‌, నిఫ్టీ - హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ యాక్టివ్‌

Stock Market Opening 18 April 2023: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఐటీ కంపెనీ షేర్ల పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితితో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.

FOLLOW US: 
Share:

Stock Market Opening 18 April 2023: 

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఐటీ కంపెనీ షేర్ల పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితితో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 34 పాయింట్లు తగ్గి 17,672 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 130 పాయింట్లు తగ్గి 59,780 వద్ద ట్రేడవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌, ఐటీసీ పాజిటివ్‌గా కదలాడుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 59,910 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,991 వద్ద మొదలైంది. 59,717 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,113 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 130 పాయింట్ల నష్టంతో 59,780 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 17,706 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,766 వద్ద ఓపెనైంది. 17,650 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,766 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 34 పాయింట్లు తగ్గి 17,672 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,406 వద్ద మొదలైంది. 42,272 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,446 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 127 పాయింట్లు పెరిగి 42,446 వద్ద నడుస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐచర్‌ మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోల్‌ ఇండియా, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్‌, పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి. ఐటీ, మీడియా, మెటల్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు నష్టపోయాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.60,920గా ఉంది. కిలో వెండి రూ.1100 తగ్గి రూ.77,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.27,660 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 18 Apr 2023 10:53 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

టాప్ స్టోరీస్

Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!

Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!

Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్

Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్

Dhurandhar Shararat Song: తమన్నాను తీసేసి ఆమెకు అవకాశం ఇచ్చారా? ఒకర్ని పైకి లేపడం కోసం ఇంకొకరిని తొక్కేయాలా?

Dhurandhar Shararat Song: తమన్నాను తీసేసి ఆమెకు అవకాశం ఇచ్చారా? ఒకర్ని పైకి లేపడం కోసం ఇంకొకరిని తొక్కేయాలా?

Nepal T20 World Cup Team: టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నేపాల్.. గత ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్న ఆసియా టీం

Nepal T20 World Cup Team: టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నేపాల్.. గత ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్న ఆసియా టీం