By: ABP Desam | Updated at : 17 Feb 2023 10:33 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 17 February 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 67 పాయింట్లు తగ్గి 17,968 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 209 పాయింట్ల నష్టంతో 61,110 వద్ద కొనసాగుతున్నాయి. రిలయన్స్, అల్ట్రాటెక్ షేర్లు యాక్టివ్‌గా ఉన్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,319 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,993 వద్ద మొదలైంది. 60,921 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,302 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 209 పాయింట్ల నష్టంతో 61,110 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 18,035 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,974 వద్ద ఓపెనైంది. 17,927 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,034 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 67 పాయింట్లు తగ్గి 17,968 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 41,514 వద్ద మొదలైంది. 41,318 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,516 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 306 పాయింట్లు తగ్గి 41,324 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 32 నష్టపోయాయి. అల్ట్రాటెక్ సెమ్, గ్రాసిమ్, బీపీసీఎల్, ఎల్‌టీ, హీరోమోటో షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌బీఐ లైఫ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టపోయాయి. మీడియా, మెటల్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఐటీ, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ సూచీలు 0.50 నుంచి ఒక శాతం మేర పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.430 తగ్గి రూ.56,730గా ఉంది. కిలో వెండి రూ.950 తగ్గి రూ.69,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.230 తగ్గి రూ.24,490 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations to Shera Energy Limited on getting #listed on NSE Emerge today. Public Issue was of Rs. 3,520.32 lakhs at an issue price of Rs. 57 per share.#listing #NSE #BellRinging #ShareMarket #StockMarket #SheraEnergyLimited #RingTheBell @ashishchauhan pic.twitter.com/UCUDP3YmHy
— NSE India (@NSEIndia) February 17, 2023
Market Update for the day.
— NSE India (@NSEIndia) February 16, 2023
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/5wtdqIoC0n
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?