By: ABP Desam | Updated at : 16 Jun 2023 11:41 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : PTI Photo )
Stock Market Opening 16 June 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ఉన్నాయి. నిన్నటి నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 59 పాయింట్లు పెరిగి 18,747 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 234 పాయింట్లు ఎగిసి 63,152 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఫార్మా, మెటల్ షేర్లకు డిమాండ్ పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,917 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,960 వద్ద మొదలైంది. 62,957 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,264 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11:30 గంటలకు 234 పాయింట్ల లాభంతో 63,152 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 18,688 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,723 వద్ద ఓపెనైంది. 18,710 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,785 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 59 పాయింట్లు పెరిగి 18,747 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,583 వద్ద మొదలైంది. 43,536 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,770 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 254 పాయింట్లు ఎగిసి 43,698 వద్ద నడుస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, యూపీఎల్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఆటో, టాటా కన్జూమర్, విప్రో, టీసీఎస్, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.60,110గా ఉంది. కిలో వెండి రూ.73,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.390 పెరిగి రూ.26,000 వద్ద ఉంది.
Also Read: ఎక్కువ వడ్డీ ఇచ్చే స్పెషల్ FDs, ఈ నెల వరకే ఈ గోల్డెన్ ఛాన్స్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
MIDCPNIFTY Derivatives touches new high - over 38 lakhs contracts traded.
— NSE India (@NSEIndia) June 16, 2023
We are grateful to all the market participants & intermediaries in achieving this milestone.#MIDCPNIFTY #FNO #Index #Options #Futures #trading #Derivatives #NSEIndia @ashishchauhan pic.twitter.com/dULj2SEaEu
Market Update for the day.
— NSE India (@NSEIndia) June 15, 2023
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/w45ykpmGg6
Attention Investors! Protect your investments by keeping your trading and Demat account user ID and password confidential. For more information, visit: https://t.co/mUiU06igdi#NSE #NSEIndia #InvestorAwareness @ashishchauhan
— NSE India (@NSEIndia) June 15, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Swarna Kuppam Vision 2029 : సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ వెయిటింగ్ పీరియడ్ ఎంత - డబ్బులు కట్టినా ఎన్నాళ్లు ఆగాలి?
KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్