By: ABP Desam | Updated at : 16 Feb 2023 10:53 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 16 February 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో మొదలైంది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. కంపెనీలు మెరుగైన ఫలితాలు ప్రకటించడంతో ఐటీ సూచీ ఎక్కువ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 86 పాయింట్లు పెరిగి 18,102 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 280 పాయింట్ల లాభంతో 61,555 వద్ద కొనసాగుతున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు మళ్లీ జీవిత కాల గరిష్ఠాల వైపు సాగుతున్నాయి. అదానీ గ్రూప్ షేర్లు పుంజుకున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,275 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,566 వద్ద మొదలైంది. 61,445 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,682 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 280 పాయింట్ల లాభంతో 61,555 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 18,015 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,094 వద్ద ఓపెనైంది. 18,061 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,134 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 86 పాయింట్ల లాభంతో 18,102 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 41,925 వద్ద మొదలైంది. 41,784 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,979 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 107 పాయింట్లు పెరిగి 41,838 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టపోయాయి. టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. హీరో మోటో, నెస్లే ఇండియా, బీపీసీఎల్, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు నష్టపోయాయి. అన్ని సూచీలు గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి. ఐటీ, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరల్లో ఎక్కువ మార్పేమీ లేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.57,160గా ఉంది. కిలో వెండి రూ.450 తగ్గి రూ.69,950 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.24,720 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In this segment of #LetsTalkFinance, let's understand what Balanced Funds are!#InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #StockMarketIndia #StockMarket #Investor #Investment #BalancedFunds @ashishchauhan pic.twitter.com/AsAN80TXMx
— NSE India (@NSEIndia) February 16, 2023
In today's #StockTerm, let's look at what a Benchmark is! Save and share if you found this helpful.#NSE #StockMarket #ShareMarket #StockTerms #NSEIndia #Investing101 #InvestorEducation #StockMarketIndia #StockExchange #StockTrading #Stocks #Investing #Trading #Benchmark pic.twitter.com/DzN3G7kDNr
— NSE India (@NSEIndia) February 15, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Crime News: గుర్తు తెలియని యువతి నుంచి వీడియో కాల్ - కూల్‌గా మాట్లాడి కొంపముంచింది, చివరకు!
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
IND vs AUS 1st Test 2nd Day Score :పెర్త్ టెస్టులో దుమ్మురేపిన భారత్ బౌలర్లు- 104 పరుగులకే ఆసీస్ ఆలౌట్- 46 పరుగుల ఆధిక్యం