search
×

Stock Market Opening: 62వేల పైనే సెన్సెక్స్‌ - ఆల్‌టైమ్‌ హై రికార్డు బ్రేక్‌ చేస్తుందా?

Stock Market Opening 15 May 2023: స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 15 May 2023: 

స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 63 పాయింట్లు పెరిగి 18,377 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 237 పాయింట్లు ఎగిసి 62,277 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 62,027 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,157 వద్ద మొదలైంది. 61,950 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,265 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 237 పాయింట్ల లాభంతో 62,277 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 18,314 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,339 వద్ద ఓపెనైంది. 18,287 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,380 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 63 పాయింట్లు పెరిగి 18,377 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,821 వద్ద మొదలైంది. 43,666 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,968 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 145 పాయింట్లు ఎగిసి 43,938 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, ఐచర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, సిప్లా, దివిస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌ నష్టపోయాయి. మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియాల్టీ సూచీలు భారీగా లాభపడ్డాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.61,800గా ఉంది. కిలో వెండి రూ.74,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 పెరిగి రూ.27,839 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 15 May 2023 10:16 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

సంబంధిత కథనాలు

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Stock Market News: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ - హీరో మోటో దూకుడు!

Stock Market News: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ - హీరో మోటో దూకుడు!

Stock Market News: రెడ్‌ జోన్లో సూచీలు - 18,500 నిఫ్టీ క్లోజింగ్‌!

Stock Market News: రెడ్‌ జోన్లో సూచీలు - 18,500 నిఫ్టీ క్లోజింగ్‌!

Stock Market: లైఫ్‌ టైమ్‌ హై ముందు మార్కెట్లో వొలటిలిటీ - సెన్సెక్స్‌ 327 పాయింట్లు డౌన్‌!

Stock Market: లైఫ్‌ టైమ్‌ హై ముందు మార్కెట్లో వొలటిలిటీ - సెన్సెక్స్‌ 327 పాయింట్లు డౌన్‌!

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?