Stock Market Opening 14 June 2023: 


స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. ఆల్‌టైమ్‌ హై దిశగా సాగే క్రమంలో కన్సాలిడేషన్‌ అవుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 12 పాయింట్లు తగ్గి 18,703 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 90 పాయింట్లు తగ్గి 63,053 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ సూచీ భారీగా పడింది. మెటల్స్‌ సూచీ బాగా పెరిగింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 63,143 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 63,115 వద్ద మొదలైంది. 63,013 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,232 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 90 పాయింట్ల నష్టంతో 63,052 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 18,716 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,744 వద్ద ఓపెనైంది. 18,690 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,753 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 12 పాయింట్లు తగ్గి 18,703 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,181 వద్ద మొదలైంది. 43,964 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,212 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 96 పాయింట్లు తగ్గి 43,983 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ఉన్నాయి. టాటా కన్జూమర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్‌, హీరోమోటో కార్ప్‌ షేర్లు తగ్గాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.60,050గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.460 తగ్గి రూ.25,890 వద్ద ఉంది. 


Also Read: ఆధార్‌ ఫ్రీ అప్‌డేషన్‌కు ఇవాళే లాస్ట్‌ డేట్‌, రేపట్నుంచి ఛార్జ్‌ పడుద్ది


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.