Stock Market Closing 13 June 2023: 


స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు పాజిటివ్‌గా ముగిశాయి. ఆల్‌టైమ్ హై దిశగా పయనిస్తున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్లు పెరిగి 18,716 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 418 పాయింట్లు ఎగిసి 63,143 వద్ద ముగిశాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలపడి 82.37 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 62,724 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,779 వద్ద మొదలైంది. 62,777 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,177 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 418 పాయింట్ల లాభంతో 63,143 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 18,601 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,631 వద్ద ఓపెనైంది. 18,631 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,728 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 114 పాయింట్లు పెరిగి 18,716 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,889 వద్ద మొదలైంది. 43,889 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,138 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 135 పాయింట్లు పెరిగి 44,079 వద్ద ముగిసింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. టాటా కన్జూమర్‌, సిప్లా, ఐటీసీ, టైటాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడ్డాయి. కొటక్‌ బ్యాంక్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎం అండ్‌ ఎం షేర్లు నష్టపోయాయి. ఆటో మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు బాగా పెరిగాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.60,450గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.74,౩00 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.25,560 వద్ద ఉంది. 


Also Read: రిటైర్మెంట్‌ నాటికి ₹10 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.