Mutual Fund SIP Calculation: రిటైర్‌మెంట్ సమయానికి వీలయినంత పెద్ద మొత్తంలో సేవల్ చేయాలని పొదుపు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వ పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పథకాల్లో పెట్టుబడులు పెడతారు. హిస్టారికల్‌గా చూస్తే, ఇతర పథకాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అధిక రాబడిని ఇచ్చాయి. అయితే, స్టాక్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ కూడా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ - SIP) క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే, దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని సంపాదించే అవకాశం ఉంది. పదవీ విరమణ సమయంలో మీరు రూ. 10 కోట్ల వరకు విత్ డ్రా చేయవచ్చు.
SIP కాలిక్యులేటర్ ప్రకారం, మీరు 25 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీరు. 10 కోట్ల వరకు మీరు కూడబట్టాలంటే మీకు 12% వార్షిక రాబడి అవసరం. 60 ఏళ్ల తర్వాత, అంటే పదవీ విరమణ నాటికి రూ. 10 కోట్ల కోసం ప్రతి నెలా రూ. 15,000 SIP చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో, ఏ నెలలో కూడా ఇది మిస్ కాకూడదు. అయితే, మీరు సరైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను ఎంచుకోవాలి. మీ డబ్బు మంచి ఫండ్‌లోకి/ సమర్థుడైన ఫండ్ మేనేజర్ చేతిలోకి వెళితే, రిస్క్ తక్కువగా ఉంటుంది, రాబడి ఎక్కువగా ఉంటుంది.
రూ. 10 కోట్లు కూడబెట్టాలంటే SIP కాలుక్యులేషన్:
మీ వయస్సు 30 సంవత్సరాలు అయితే, 12% రాబడి అంచనా ప్రకారం, 60 ఏళ్ల వయస్సులో రూ. 10 కోట్లు పొందడానికి మీరు ప్రతి నెలా రూ. 28,329 పెట్టుబడి పెట్టాలి.
మీ వయస్సు 35 సంవత్సరాలు అయితే, 12% రాబడి అంచనా ప్రకారం, 60 ఏళ్ల వయస్సులో రూ. 10 కోట్లు పొందడానికి మీరు ప్రతి నెలా రూ. 52,697 పెట్టుబడి పెట్టాలి.
మీ వయస్సు 40 సంవత్సరాలు అయితే, 12% రాబడి అంచనా ప్రకారం, 60 ఏళ్ల వయస్సులో రూ. 10 కోట్లు పొందడానికి మీరు ప్రతి నెలా రూ. 1,00,085 పెట్టుబడి పెట్టాలి.
మీ వయస్సు 45 సంవత్సరాలు అయితే, 12% రాబడి అంచనా ప్రకారం, 60 ఏళ్ల వయస్సులో రూ. 10 కోట్లు పొందడానికి మీరు ప్రతి నెలా రూ. 1,98,186 పెట్టుబడి పెట్టాలి.
మీ వయస్సు 50 సంవత్సరాలు అయితే, 12% రాబడి అంచనా ప్రకారం, 60 ఏళ్ల వయస్సులో రూ. 10 కోట్లు పొందడానికి మీరు ప్రతి నెలా రూ. 4,30,405 పెట్టుబడి పెట్టాలి.
ఒక్క నెల కూడా ఆగకుండా కచ్చితంగా ప్రతి నెలా పెట్టుబడి పెడితేనే రూ. 10 కోట్ల టార్గెట్‌ను మీరు చేరుకుంటారు.
మరో ఆసక్తికర కథనం: తక్కువ EMI - ఇదొక ట్రాప్, తస్మాత్ జాగ్రత్త!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.