By: Rama Krishna Paladi | Updated at : 11 Jul 2023 10:26 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 11 July 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం దూకుడు కనబరుస్తున్నాయి. ఆరంభం నుంచే ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 117 పాయింట్లు పెరిగి 19,473 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 392 పాయింట్లు ఎగిసి 65,737 వద్ద కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త గరిష్ఠానికి చేరుకుంది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,390 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,598 వద్ద మొదలైంది. 65,517 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,767 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 392 పాయింట్ల లాభంతో 65,737 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,368 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,427 వద్ద ఓపెనైంది. 19,406 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,488 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 117 పాయింట్లు పెరిగి 19,473 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,998 వద్ద మొదలైంది. 44,932 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,076 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 141 పాయింట్లు పెరిగి 45,002 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్, హీరోమోటో కార్ప్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, విప్రో షేర్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్ మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేం లేవు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.59,410గా ఉంది. కిలో వెండి రూ.73,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.24,720 వద్ద ఉంది.
Also Read: నెలలో ఏ రోజున సిప్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుందో తెలుసా!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Congratulations Pakka Limited on getting listed on NSE today. Pakka Ltd. is revolutionizing the Indian packaging industry with its commitment to sustainability and innovation. Founded in 1981, the company has evolved to become a global leader in regenerative packaging solutions.… pic.twitter.com/Lp6ZMRFf5y
— NSE India (@NSEIndia) July 11, 2023
The #NSEBell has rung in the celebration of the Opening Bell Ceremony of Yash Pakka Limited on NSE today! #NSE #NSEIndia #listing #IPO #StockMarket #ShareMarket #YashPakkaLimited @ashishchauhan pic.twitter.com/CgOQfUMCiE
— NSE India (@NSEIndia) July 11, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Eating Ghee on an Empty Stomach : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు