Stock Market Opening 06 June 2023: 


స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల  నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఆల్‌టైమ్‌ హై వద్ద సూచీలు కన్సాలిడేట్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 22 పాయింట్లు తగ్గి 18,571 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 97 పాయింట్లు తగ్గి 62,690 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 62,787 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,738 వద్ద మొదలైంది. 62,666 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,851 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 97 పాయింట్ల నష్టంతో 62,690 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 18,593 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,600 వద్ద ఓపెనైంది. 18,565 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,618 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 22 పాయింట్లు తగ్గి 18,571 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ ఎరుపెక్కింది. ఉదయం 44,156 వద్ద మొదలైంది. 44,051 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,191 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 30 పాయింట్లు తగ్గి 44,070 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 28 కంపెనీలు లాభాల్లో 22 నష్టాల్లో ఉన్నాయి. మారుతీ, అల్ట్రాటెక్‌ సెమ్‌, గ్రాసిమ్‌, దివిస్‌ ల్యాబ్‌, హీరోమోటో కార్ప్‌ షేర్లు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి రూ.60,650గా ఉంది. కిలో వెండి రూ.500 ఎగిసి రూ.73,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.27,470 వద్ద ఉంది.


Also Read: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.